జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే మీలో ఈ మార్పు వచ్చి ఉంటుంది.. అదేంటంటే?

First Published Nov 16, 2021, 2:07 PM IST

పోషకాహార లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు సమస్యలు (Hair problems) ఎదురవుతున్నాయి. జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం. జుట్టు నిగనిగలాడుతూ మెరిసేందుకు రంగులను వేసుకుంటాం. అయితే ఈ రంగులు వాడటం జుట్టు సంరక్షణకు మంచిది కాదు. వీటిలోని రసాయన పదార్థాలు జుట్టు పెరుగుదలకు హాని కలిగిస్తాయి. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా రంగులు వాడకుండా నిగనిగలాడే ఒత్తయిన జుట్టు మన సొంతం కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
 

ఒత్తయిన నిగనిగలాడే మెరిసే జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. దానికోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అప్పుడే మన జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ గాఢత గల షాంపూలతో తలస్నానం చేయరాదు. ఈ షాంపూలోని (Shampoo) కెమికల్స్ (Chemicals) జుట్టు సహజ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తాయి.
 

తలస్నానం గంటలతరబడి చేయరాదు. తలస్నానం చేసిన తరువాత జుట్టును ఎక్కువసేపు తడిగా ఉంచరాదు. తడి జుట్టును (Wet hair) దువ్వడం చేయరాదు. జుట్టు ఆర పెట్టుకోవడానికి డ్రయర్లను వాడడం మంచిది కాదు. ఇలా డ్రయర్లతో జుట్టు ఆరపెట్టుకోవడంతో జుట్టులో పగుళ్ళు ఏర్పడటం, బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది. జుట్టును దువ్వడానికి మంచి దువ్వెనను ఉపయోగించాలి. పళ్ళు దూరంగా ఉండే దువ్వెనలను (Comb) మాత్రమే ఉపయోగించాలి.
 

జుట్టు దూకుడు సమయంలో బలవంతంగా లాగాకూడదు. హార్డ్ గా ఉన్న దువ్వెనను వాడడంతో తలపై ఉన్న సున్నిత చర్మం దెబ్బతింటుంది. జుట్టుకు రంగులు (Hair colours) వేసే అలవాటు మానుకోవాలి. రంగులలోని రసాయనాలు జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. సహజసిద్ధమైన పద్ధతిలను అనుసరించడం మంచిది. రోజువారీ జీవన విధానంలో ఎక్కువ నీటిని (Water) సేవించడం అవసరం. 
 

పాలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, పచ్చని ఆకుకూరలు, కూరగాయలు మీరు రోజూ తీసుకునే ఆహారంలో (Food) ఉండేలా చూసుకోండి. అప్పుడే మన జుట్టుకు కావలసిన పోషకాలు (Nutrients) అంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానానికి ముందు కొబ్బరినూనెను (Coconut oil) గోరువెచ్చగా వేడిచేసి శిరోజాలకు పట్టించాలి. దీంతో జుట్టుకు సహజ నిగారింపు పెరుగుతుంది.
 

జుట్టు కుదుళ్లు బలంగా పెరుగుతాయి. శిరోజాలకు నూనె మర్దన (Oil massage) చాలా అవసరం. తలకు నూనెతో మర్దన చేసుకోవడంతో జుట్టు కుదుళ్లకు సరైన పోషకాలు అందుతాయి. శిరోజాలకు నూనె మర్దన ఎంత ముఖ్యమో తలస్నానం తర్వాత కండిషనర్ కూడా అంతే ముఖ్యమని సౌందర్యనిపుణులు తెలుపుతున్నారు. జుట్టు సంరక్షణకు సహజమైన కండీషనర్ లను వాడాలి. సహజ సిద్ధమైన కండిషనర్ (Conditioner) జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని సూచిస్తారు.
 

ఇందువల్ల శిరోజాలకు చక్కని మెరుపు నిగారింపు వస్తుంది. జుట్టు నిగారింపును పెంచేందుకు ఆర్టిఫిషల్ క్రీములను (Artificial creams) వాడరాదు. ఇది తాత్కాలిక (Temporary) మెరుపును అందిస్తాయి. వీటిలోని ఎక్కువగా ఉండే రసాయనాలు జుట్టు నల్లధనాన్ని తగ్గించి తెల్లగా మార్చడానికి కారణమవుతాయి. సహజసిద్ధమైన పద్ధతులు అనుసరించడంతో మన జుట్టు ఎప్పటికీ నిగారింపును కోల్పోదు. జుట్టుకు రంగులు వేసే అలవాటు మానుకోండి.

click me!