వెన్ను నొప్పితో బాధపడుతున్నారా...? కిచెన్ లోని ఈ ఫుడ్స్ తో చిటికెలో పరిష్కారం..!

First Published Nov 14, 2021, 3:05 PM IST

మన కిచెన్ లో లభించే కొన్ని మసాలాలతో.. మన నడుము నొప్పి ని చిటికెలో పొగొట్టేయవచ్చట. మరి ఆ మసాలా ఏంటో చూద్దాం..

ఒకప్పుడు.. 40ఏళ్లు దాటిన వారికి  మాత్రమే నడుము నొప్పి వచ్చేది. కానీ.. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు యువకులు కూడా  వెన్ను నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. మన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, రోగ నిరోధక వ్యవస్థ  సరిగా లేకపోవడం.. ఇలా పలు కారణాల వల్ల  ఈ సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి.
 

ఆరోగ్యం సరిగా ఉండాలి అంటే.. మనం తీసుకునే ఆహారం సరిగా ఉండాలి. ముఖ్యంగా వెన్ను నొప్పి పోగొట్టాలంటే.. మాత్రం.. ట్యాబ్లెట్స్  మింగుతూ.. ఆయింట్ మెంట్స్  రాయడం లాంటివి చేస్తుంటారు. అయితే.. మన కిచెన్ లో లభించే కొన్ని మసాలాలతో.. మన నడుము నొప్పి ని చిటికెలో పొగొట్టేయవచ్చట. మరి ఆ మసాలా ఏంటో చూద్దాం..

ఈ రోజుల్లో గంటలు గంటలు కుర్చీల్లో కూర్చొని  వర్క్ చేయడం వల్ల కూడా ఈ నుడుము, వెన్ను నొప్పి రావడం జరుగుతాయి. కదలకుండా.. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల.. ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.  ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల.. వెన్ను పై ఒత్తిడి పడటం వల్ల  ఈ సమస్య వస్తుంది.
 

వెన్ను నొప్పిని తగ్గించడానికి.. కొన్ని రకాల ఆహారాలను మీ డైట్ లో చేర్చాలి. వీటిని కనుక తీసుకుంటే..  వెన్ను సమస్యను తగ్గించుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా పుసుపు కీలక పాత్ర పోషిస్తుంది.ఈ పసుపుని పాలల్లో.. లేదా.. ఇతరు ఆహారాల్లో  కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల.. వెన్ను నొప్పి తగడంతోపాటు.. వెన్ను వాపు కూడా తగ్గుతుందట. వెన్ను కండరాల నుంచి ఉపశమనం లభించడానికీ సహకరిస్తుందట.

కాబట్టి.. పసుపు పాలు, పసుపు వేసి హెర్బల్ టీలు తాగడం  వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చట. పసుపుతోపాటు.. అల్లం కూడా ఉపశమనం కలిగిస్తుందట. అల్లం ఎక్కువగా వేసుకొని టీ తాగడం.. కూరల్లో అల్లం ఎక్కువగా వేసుకొని తినడం లాంటివి చేయాలట. కాబట్టి.. అల్లం కూడా ఎక్కువగా తీసుకోవాలట. వీటిని తీసుకోవడం వల్ల..  నడుము, వెన్ను నొప్పులు తగ్గిపోతాయట.

click me!