బరువు తగ్గిన తర్వాత విపరీతంగా ఆకలి అవుతోందా? అయితే ఇలా చేయండి

First Published | Oct 27, 2023, 1:05 PM IST

చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో తిప్పలు పడుతరు. అయితే బరువు తగ్గిన తర్వాత విపరీతమైన ఆకలి కోరికలు కలుగుతుంటాయి. వీటిని కంట్రోల్ చేయడం చాలా మందికి కాదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మీ ఆకలిని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

బరువు తగ్గడం మనం అనుకున్నంత సులువేం కాదు. కానీ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న సైజ్ లోకి వస్తారు. ఇలా బరువు తగ్గడంలో సక్సెస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే చాలా మందికి బరువు తగ్గిన తర్వాత విపరీతంగా ఆకలి అవుతుంటుంది. దీంతో తినడం మొదలుపెడితే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది. మీకు తెలుసా? బరువు తగ్గిన తర్వాత ఆకలి, సంతృప్తి హార్మోన్ స్థాయిలు రెండూ పెరుగుతాయి. అందుకే విపరీతంగా ఆకలిగా అనిపిస్తుంది. 
 

బరువు తగ్గిన తర్వాత ఎక్కువ ఆకలిగా ఎందుకు అనిపిస్తుంది?

హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. మీరు బరువు తగ్గినప్పుడు.. ఆకలిని ప్రేరేపించే హార్మోన్ అయిన గ్రెలిన్ హార్మోన్ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యే కొన్ని కిలోల బరువు తగ్గిన వారిలో ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకే బరువు తగ్గిన తర్వాత విపరీతంగా ఆకలిగా అనిపిస్తుంది. మరి ఈ ఆకలిని నియంత్రించడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


సమయానికి తినండి

సమయానికి తినకపోవడం వల్ల మీ మానసిక స్థితి, జీవక్రియ, శరీర శక్తి స్థాయిలు ప్రభావితం అవుతాయి. దీంతో మీకు ఆకలిగా అనిపిస్తుంది. ఇలా కాకూడంటే..రోజుకు ఒకే సమయానికి తినండి. దీంతో మీకు సంతృప్తిని కలుగుతుంది. ఆకలిగా అనిపించే అవకాశం తగ్గుతుంది. అలాగే మీరు ఎనర్జిటిక్ గా కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇది ఆకలిగా అనిపించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

హెల్తీ స్నాక్స్

మీకు ఆకలి మరీ ఎక్కువగా అయినప్పుడు ఆ క్షణంలో స్నాక్స్ ను తినంది. ఇందుకోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఆకలిగా అనిపించినప్పుడు ఆరోగ్యాన్ని పాడు చేసే కేలరీలు ఎక్కువగా స్నాక్స్ కు బదులుగా హెల్తీ స్నాక్స్ ను తినండి. ఇది మీ ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

ఫైబర్ 

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఆకలిని నియంత్రించడానికి సహాయపడతాయి. ఫైబర్ మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, కాయలు, విత్తనాలు వంటి వాటిని చేర్చండి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 
 

ప్రోటీన్ స్నాక్స్

ఆకలిని తగ్గించడానికి ప్రోటీన్ ప్యాక్డ్ స్నాక్స్ కూడా బాగా సహాయపడతాయి. గ్రీకు పెరుగు, గింజలు వంటి ప్రోటీన్ ఫుడ్స్ మీ కడుపును సంతృప్తికరంగా ఉంచుతాయి. తరచుగా ఆకలి అయ్యే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. 

హైడ్రేట్ గా ఉండండి

దాహం అయినా  ఆకలిగానే భావిస్తుంటారు చాలా మంది. అందుకే దాహానికి, ఆకలికి తేడా తెలుసుకోండి. నీళ్లను తాగకపోయినా ఇలాగే అనిపిస్తుంది. అందుకే వెదర్ చల్లగా ఉన్నా రోజంతా నీళ్లను పుష్కలంగా తాగండి. హైడ్రేటెడ్ గా ఉంటే ఆకలి అంతగా కాదు. 

Latest Videos

click me!