చలికాలంలో చలివల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో రోగాలు వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే? ప్రతిరోజూ మూడు లీటర్ల నీటిని తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వయస్సు, శారీరక శ్రమ, గర్భధారణను బట్టి కూడా మన శరీరానికి నీటి అవసరం మారుతుంది. అందుకే మన శరీర కూర్పు ప్రకారం నీటిని తాగడం ముఖ్యం. శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో మీకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అందుకే చలికాలమైనా, వానాకాలమైనా నీటిని పుష్కలంగా తాగడం ముఖ్యం. చలికాలంలో చల్లనీళ్లను తాగాలనిపించకపోతే.. గోరువెచ్చని నీటిని తాగండి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా.