Health Tips: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో సమస్యకి చెక్ పెట్టండి!

First Published | Oct 5, 2023, 11:15 AM IST

Health Tips: సాధారణంగా మలబద్ధకంతో బాధపడే వ్యక్తులు ప్రయాణాల అప్పుడు మరింత ఎక్కువ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంటి చిట్కాలతో సమస్యకి చెక్ పెట్టడం ఎలాగో చూద్దాం.
 

 మలబద్ధకం అనేది జీర్ణశయాంతర  సమస్య. అనారోగ్యకరమైన ఆహారం, సరియైన జీవనశైలి లేకపోవటం వంటివి మలబద్ధకానికి కారణం. సాధారణంగా మలబద్ధకంతో బాధపడేవారు ప్రయాణాలప్పుడు ఆ బాధని మరింత ఎక్కువ భరించాల్సిన పరిస్థితి వస్తుంది.
 

 అయితే సహజ పద్ధతులతో మలబద్ధకాన్ని ఎదుర్కొనే మార్గాలు చూద్దాం. మలబద్ధకానికి ప్రధాన సమస్య నీరు తక్కువగా తాగటం. కాబట్టి ముందుగా అధిక మొత్తంలో నీరు తాగండి. అలాగే మీ రోజువారి ఆహారంలో  ఎక్కువగా ఫైబర్ ఉండేలాగా చూసుకోండి.
 


ప్రతిరోజు నారింజ తినండి. ఇందులో విటమిన్ సి తో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే పాలలో కొన్ని ఖర్జూరాలను నానబెట్టి గుజ్జులాగా చేసి పాలతో కలిపి వారం రోజులు పాటు తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

త్రిఫల చూర్ణం తేనెతో రోజుకి రెండుసార్లు తీసుకుంటే చాలా మంచిది. మలబద్ధకం కోసం  ఇది ఒక గొప్ప ఆయుర్వేద సూచన. అలాగే పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవటం వలన మలబద్ధకం నివారించవచ్చు. ఇది ఒక పురాతన భారతీయ సాంప్రదాయ ఔషధం.

అలాగే అర గ్లాసు బచ్చలిరసాన్ని ఆరు గ్లాసు నీటిలో కలిపి రోజుకి రెండుసార్లు రెండు మూడు రోజులు పాటు తాగండి. ఇది తీవ్రమైన మలబద్ధకం నుంచి కూడా  మిమ్మల్ని రక్షిస్తుంది. మలబద్ధకానికి ప్రధాన కారణం ప్రేగులకు సరియైన కదలికలు లేకపోవడం. కాబట్టి ప్రేగు కదలికలను మెరుగుపరచడానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి  రోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగండి.

అలాగే రెగ్యులర్ గా శారీరక వ్యాయామము, ప్రాణాయామము, యోగ చేయటం వలన కూడా ప్రేగు కదలిక చురుగ్గా ఉంటుంది. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి పవన్ ముక్తాసనం, బాలాసనం, అర్ధమత్యేంద్రాశనం మరియు సుప్త వజ్రాసనం వంటి ఆసనాలు చేయటం వలన సులువుగా మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Latest Videos

click me!