Laughing Benefits: పెద్దగా నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Published : Apr 16, 2025, 04:56 PM IST

నవ్వు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. నవ్వు చాలా సమస్యలను దూరం చేస్తుంది. ఇది తెలియక చాలామంది ఎప్పుడూ మూతి.. హుమ్ అని పెట్టుకొని కూర్చొంటారు. కానీ మీరు గమనించారో లేదో ఉదయం గానీ సాయంత్రం గానీ.. పార్కుల్లో చాలామంది పెద్ద వయసు వారు ఓ చోట చేరి పెద్దగా నవ్వుతుంటారు. వారు అలా ఎందుకు నవ్వుతారో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
19
Laughing Benefits: పెద్దగా నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

చాలామంది వృద్ధులు ఉదయం లేదా సాయంత్రం పార్కుల్లో గుమిగూడి జోరుగా నవ్వుకుంటారు. గట్టి గట్టిగా నవ్వుతారు. వారు అలా చేయడం చూసి చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకిలా నవ్వుతున్నారు? దాని వల్ల లాభాలేంటి? అని.. అలా మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

29
గట్టిగా నవ్వడానికి కారణాలు

ఒత్తిడి తగ్గించడం: 

మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల టెన్షన్లు, ఒత్తిడి క్షణాల్లో మాయమవుతాయి. నవ్వు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. దానివల్ల మరింత సంతోషంగా ఉంటారు.

39
సామాజిక సంబంధాలు:

వృద్ధులు చాలా వరకు ఒంటరితనాన్ని ఎదుర్కొంటారు. పార్కులో నవ్వడం వల్ల వారికి సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

49
సానుకూల దృక్పథం:

నవ్వు సానుకూల భావాలను ప్రోత్సహిస్తుంది. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఎవరైనా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే చూసి క్షణాల్లో మీరు కూడా నవ్వడం మొదలుపెడతారు.

59
శారీరక ప్రయోజనాలు:

నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఇది మీ శరీరంలోని నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నవ్వడం వల్ల ముఖ కండరాలు సాగుతాయి. ఇది సహజ ముఖ మసాజ్ లాంటిది. జోరుగా నవ్వడం వల్ల మీ ముఖంలో కాంతి వస్తుంది.

69
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

నవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

79
రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది:

మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.

89
మెరుగైన శ్వాస

పెద్దగా నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస మెరుగుపడుతుంది. అందుకే వృద్ధులు ఉదయాన్నే గట్టిగా నవ్వుతారు. దీని వల్ల ఊపిరితిత్తులకు తగినంత గాలి అందుతుంది.

99
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

జోరుగా నవ్వడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ తగ్గుతాయి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచి అలవాటు.

Read more Photos on
click me!

Recommended Stories