కొలెస్ట్రాల్ ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలివి..

Published : Jul 18, 2023, 03:10 PM IST

గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం చాలా అవసరం. కొన్ని సింపుల్ చిట్కాలు మీ ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి. 

PREV
19
కొలెస్ట్రాల్ ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలివి..
high cholesterol

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే గుండెపోటు నుంచి ఎన్నో ప్రాణాంత రోగాల ముప్పు పెరుగుతుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ ల ప్రమాదాన్ని పెంచుతుంది. మీ జీవనశైలి మెరుగ్గా ఉండి, ఆహారపు అలవాట్లు బాగుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం సులువని నిపుణులు చెబుతున్నారు. 

29
bad cholesterol

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలి. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. అలాగే స్మోకింగ్ ను మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మందులు లేకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

39
cholesterol

ఆరోగ్యకరమైన ఆహారం

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. రెడ్ మీట్, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అందుకే వీటికి బదులుగా గింజలు, విత్తనాలు, అవొకాడోలు, ఆలివ్ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి. 
 

49
fiber

కరిగే ఫైబర్ 

కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్, బార్లీ, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 
 

59

క్రమం తప్పకుండా వ్యాయామం

చురుకైన నడక, జాగింగ్, స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ వంటి సాధారణ శారీరక శ్రమలో రోజూ పాల్గొనండి. వ్యాయామం మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుది. ఇది మీ మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

69

స్మోకింగ్ మానేయండి

స్మోకింగ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా రక్త నాళాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతుంది. స్మోకింగ్ ను మానేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుది.  
 

79

ఒత్తిడిని తగ్గించండి

దీర్ఘకాలిక ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడి తగ్గేందుకు యోగా, ధ్యానం, లోతైన శ్వాస లేదా మీకు ఆనందం కలిగించే పనుల్లో పాల్గొనండి. 
 

89
omega 3 fatty acids

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

కొవ్వు చేపలైన  సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, అవిసె గింజలు, చియా విత్తనాలు వంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి, మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

99

గ్రీన్ టీ

గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఇవి  మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories