బరువు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి చాలు..

First Published | Oct 31, 2023, 3:55 PM IST

బరువు తగ్గడం మనమనుకున్నంత సులువేమీ కాదు. ఇందుకోసం రెగ్యురల్ గా వ్యాయామం చేయాలి. హెల్తీ ఫుడ్స్ నే తినాలి. ఆయిలీ ఫుడ్ ను అసలే తినకూడదు. అలాగే టైం ప్రకారమే పడుకోవాలి. నిద్రలేవాలి.
 

ప్రస్తుతం చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు,  శారీరక శ్రమ తగ్గడమే అధిక బరువుకు ప్రధాన కారణం. ఇక పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఎంతో ట్రై చేస్తుంటారు. అయినా బరువు తగ్గనివారున్నారు. అయితే బరువు తగ్గే ప్రాసెస్ లో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీరు బరువు తగ్గకుండా చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అలాగే ఏవి పడితే అవి తినకూడదు. ఆయిలీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే వాటిని తినకూడదు. అలాగే టైం టూ టైం తినాలి. బరువు తగ్గడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అందుకే బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహార నియమాలను పాటించాలి. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పడుకునే ముందు కొన్ని పనులను చేస్తే సులువుగా వెయిట్ లాస్ అవుతారని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


Weight Loss

టీ, కాఫీలు వద్దు

బరువు తగ్గాలనుకునేవారు మొదటగా చేయాల్సిన పని రాత్రిపూట టీ, కాఫీలను అస్సలు తాగకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ రాత్రిపూటి నిద్రపట్టకుండా చేస్తుంది. నిద్రలేమి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రిపూట కొద్దిగా పుదీనా టీ తాగితే మీ జీర్ణక్రియ పెరుగుతుంది. దీంతో కొవ్వు వేగంగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఇది మీరు బరువు తగ్గేలా చేస్తుంది. 
 

సింపుల్ డిన్నర్

చాలా మంది రాత్రిళ్లు మసాలా ఫుడ్ ను ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిలో కేలరీలు, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తింటే బరువు బాగా పెరిగిపోతారు. అందుకే రాత్రిళ్లు మీరు తినే భోజనం చాలా సింపుల్ గా ఉండాలి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు రాత్రిపూట  కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం మానుకోవాలి. 
 

టైం కు తినడం

రాత్రి లేట్ గా భోజనం చేయడం, లేట్ గా నిద్రపోవడం, ఉదయం లేట్ గా నిద్రలేవడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ అలవాట్లు మీకు అసలే ఉండకూడదు. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వీలైనంత త్వరగా అంటే 6 నుంచి 7 గంటలలోపూ తినండి. తొందరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. రాత్రిపూట హెవీగా తినడం, ఆలస్యంగా తినడం వల్ల మీకు జీర్ణసమస్యలు వస్తాయి. దీనివల్ల మీరు బరువు తగ్గడం సాధ్యం కాదు. 

Weight Loss

ఆల్కహాల్

మీకు మందు తాగే అలవాటుంటే వెంటనే మానుకోండి. ఆల్కహాల్ తాగే అలవాటుంటే మీరు ఎంత చేసినా అస్సలు బరువు తగ్గరు. ముఖ్యంగా రాత్రిళ్లు మందుకు దూరంగా ఉండాలి. అంతేకాదు మీరు ఆల్కహాల్ ఆధారిత పానీయాలను కూడా తాగకూడదు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి. 
 

Weight Loss

స్నాక్స్

చాలా మందికి రాత్రిపూట స్నాక్స్ తినే అలవాటుంటుంది. కానీ బరువు తగ్గాలనుకునే స్నాక్స్ ను తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే హెల్తీ స్నాక్స్ ను మాత్రమే తినండి. కాదని  బయట కొన్ని చిప్స్ గట్రా తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అందుకే స్నాక్స్ ను తినాలనిపిస్తే ఇంట్లో తయారుచేసిన పాప్ కార్న్, గింజలను తినండి. అది కూడా లిమిట్ లోనే తినాలి.

click me!