ఉదయాన్నే సిగరెట్ కాల్చుతరా? ఈ విషయం తెలిస్తే ఆ పని చెయ్యడానికే భయపడతారు

Published : Oct 31, 2023, 07:15 AM IST

స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అన్న ముచ్చట దాన్ని కాల్చేవారికి కూడా తెలుసు. కానీ ఆ అలవాటును మాత్రం మానలేకపోతుంటారు. కారణం దానికి అడిక్ట్ కావడం. కానీ ఇది ప్రాణాంతక రోగాల బారిన పడేస్తుంది. 

PREV
16
ఉదయాన్నే సిగరెట్ కాల్చుతరా? ఈ విషయం తెలిస్తే ఆ పని చెయ్యడానికే భయపడతారు

సిగరెట్ ను కాల్చడం వల్ల ఎంత ప్రమాదమో ప్రత్యేకించి  చెప్పాల్సిన అవసరం లేదు. స్మోకింగ్ అలవాటున్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనందరికీ తెలిసిందే. అయినా ఈ వ్యసనాన్ని మాత్రం మానుకోలేకపోతుంటారు. ఏదేమైనా కాస్త ప్రయత్నిస్తే ఈ చెడు అలవాటును వదిలించుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు.

26

అయితే చాలా మంది రోజుకు ఐదారు సిగరేట్లనైనా కాల్చుతుంటారు. ఉదయం, సాయంత్రం అంటూ వాటిని కాల్చుతూనే ఉంటారు. అయితే ఉదయం లేచిన వెంటనే సిగరేట్లను కాల్చే అలవాటు అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం సిగరేట్లను కాల్చే అలవాటున్నవారు దీనికి బానిసలయ్యారని నిపుణులు చెబుతున్నారు. 

36

సిగరెట్లలో ప్రమాదకరమైన నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి వ్యసనం కావడం వల్లే ఇలా సిగరేట్లను ఎక్కువగా కాల్చుతారని నిపుణులు అంటున్నారు. ఇదే మిమ్మల్ని పదేపదే సిగరెట్లు తాగేలా చేస్తుందంటున్నారు నిపుణులు. ఉదయాన్నే సిగరెట్లు తాగేవారికి ధూమపానం వల్ల వచ్చే క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

46
smoking

పరిశోధకుల ప్రకరాం.. ఉదయం సిగరేట్లను కాల్చే అలవాటున్నవారికి నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం తమ అధ్యయనం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చింది. ఉదయం నిద్రలేచిన అరగంటలోపే సిగరెట్లు తాగితే వారి 'వ్యసనం' ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు వీరి ఆరోగ్యం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

56
smoking dangerous

అలాగే ఉదయం కార్యకలాపాలకు ముందు, ఆ తర్వాత  సిగరేట్లను కాల్చడం వీరికున్న తీవ్రమైన వ్యసనాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు. అందుకే సిగరేట్లను కాల్చే అలవాటును వీలైనంత తొందరగా మానేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సిగరేట్ వ్యసనం ఉన్నవారికి ఇది చెప్పినంత ఈజీ కాకపోవచ్చు. కానీ కొన్ని చిట్కాలతో ఈ వ్యసనం నుంచి బయటపడొచ్చు. 

 

66

స్మోకింగ్ అలవాటు పూర్తిగా పోవాలంటే ఇంట్లో, మీ ఆఫీసు బ్యాగు, వెహికిల్ లో సిగరేట్లను పెట్టడం మానేయండి. అలాగే  ప్రయాణాల్లో సిగరెట్లు తాగే వారికి దూరంగా ఉండండి. సిగరేట్ తాగాలనిపించినప్పుడు మీకు ఇష్టమైన లేదా వేరే పనులను చేయండి. సిగరేట్ కాల్చాలన్న ఆలోచన పోతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories