ఆవనూనెతో మర్ధన
ఆవనూనె చర్మంలో ఉండే చనిపోయిన కణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మోకాళ్లు, చేతుల్లో ఉండే నలుపును పోగొట్టడానికి ఆవనూనెను కొద్దిగా వేడి చేసి మీ చేతులు, కాళ్ళకు మర్దన చేయాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇలా చేసి, మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో స్నానం చేయాలి లేదా కడిగినా సరిపోతుంది.
మరొక చిట్కా ఏమిటంటే ఆవాలను పొడి చేసి, అందులో కొద్దిగా పచ్చి పాలు వేసి బాగా కలిపి, దానిని చేతులు, కాళ్ళ మోకాళ్ళకు రాసి స్క్రబ్‌లా రుద్దాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ఒక వారంలోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.