పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా చాలా రోగాల నుంచి కాపాడతాయి. అందుకే రోజు ఏదో ఒక పండు తినమని డాక్టర్లు చెబుతారు.
అయితే పండ్లు తినడానికి సరైన సమయం కూడా ఉంటుంది. అంటే, ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనానికి ముందు పండ్లు తినడం మంచిది. కావాలంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా తినొచ్చు. కానీ రాత్రిపూట.. అది కూడా ఆలస్యంగా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ కొన్ని పండ్లు రాత్రిపూట తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏ పండ్లు రాత్రి తినకూడదో తెలుసుకుందాం.