మోదుగ పూలు ఒక రకమైన సువాస కలిగి ఉంటాయి. ఎరుపు రంగులో కనిపించే ఈ పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు మోదుగ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తాయి. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మోదుగ విత్తనాల్ని పొడి చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయట. మోదుగ పూల ఔషధ గుణాల గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
నిద్ర సమస్యకు మోదుగ పువ్వు..
వసంతకాలంలో వచ్చే ఈ పువ్వు నిద్ర సమస్యలను దూరం చేస్తుందట. మోదుగ ఆకుల రసం తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చర్మ వ్యాధులకు...
వేసవిలో చాలా మందికి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మోదుగ పువ్వుల గింజల పొడిని వాడితే దురద తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మూత్ర సంబంధిత వ్యాధులకు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పువ్వుల మొగ్గలు చాలా మంచిదట. దీని పొడిని వాడితే చాలా వ్యాధులు నయమవుతాయట.
క్రిముల నుంచి రక్షణగా..
మోదుగ చెట్టు బెరడు డయేరియాను నివారిస్తుందట. దీని గింజలు క్రిమిసంహారకంగా పనిచేస్తాయట. ఇవి ఆకలిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మోదుగ పువ్వులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్ల లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి
రక్త శుద్ధికి మోదుగ..
రక్తాన్ని శుద్ధి చేయడానికి మోదుగ చెట్టు బెరడు బాగా ఉపయోగపడుతుంది. రక్తం శుద్ధి అయితే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణ సమస్యలకు పరిష్కారంగా..
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మోదుగ పూలు చాలా మంచిది. ఇది అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
మెరుగైన కంటి చూపు..
మోదుగ పూలు చూడటానికి అందంగా ఉండటమే కాదు.. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.