మిగిలిపోయిన అన్నంతో నోరూరించే క్రిస్పీ వడలు.. ఎలా తయారు చెయ్యాలంటే?

First Published Dec 29, 2021, 7:08 PM IST

మిగిలిపోయిన అన్నాన్ని (Leftover rice) పడేస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ రెసిపీ. అందరి ఇంటిలో ఎప్పుడో ఒకసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అన్నంను పడేయడానికి మనసొప్పక ఏం చేయాలని ఆలోచిస్తున్నారా! అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపమని అంటారు. కనుక తినే అన్నాన్ని వృధా చేయరాదు. మరి ఏ విధంగా మిగిలిపోయిన అన్నాన్ని ఉపయోగించాలి అని అనుకుంటున్నారా! అయితే మిగిలిపోయిన అన్నంతో వడలు చేసుకోవచ్చని మీకు తెలుసా! ఇలా మిగిలిపోయిన అన్నంతో వడలు చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా నోరూరించే క్రిస్పీ వడలు (Vadalu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

చాలామంది మిగిలిపోయిన అన్నంతో ఒడియాలు చేస్తుంటారు. కానీ ఇది ఎక్కువ సమయంతో కూడిన పని. కనుక తక్కువ సమయంలో, తక్కువ పదార్థాలతో, ఎంతో సులభంగా (Easily) తయారు చేసుకునే ఈ వడలను ట్రై చేయండి. ఇలా మిగిలిపోయిన అన్నంతో చేసుకునే వడలు రుచికి తిరుగుండదు. మీ ఇంటిల్లిపాదికీ ఈ వడలు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వడల తయారీ విధానం (Method of preparation) గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల మిగిలిపోయిన అన్నం (Rice), ఒక కప్పు బొంబాయి రవ్వ (Bombay Ravva), ఒక స్పూన్ అల్లం (Ginger) తరుగు, రెండు పచ్చిమిర్చి (Green chillies), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), ఒక స్పూన్ జీలకర్ర (Cumin seeds), తరిగిన కొత్తిమీర (Chopped Coriyander), సగం కప్పు పెరుగు (Curd),  రుచికి సరిపడా ఉప్పు (Salt), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil). 
 

తయారీ విధానం: వడలు తయారీ విధానం కోసం రెండు కప్పుల అన్నాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ (Grind) చేసుకున్న అన్నం మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక కప్పు బొంబాయిరవ్వ, కట్ చేసుకొన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

ఇప్పుడు ఇందులో రుచికి సరిపడు ఉప్పు (Salt), కొద్ది కొద్దిగా పెరుగు (Curd) వేస్తూ మిశ్రమాన్ని వడల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకోవాలి.  ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని చేత్తో వడల్లా ఒత్తుకుని ఆయిల్ లో వేయాలి. వడలు రెండువైపులా మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

వడలు ఫ్రై అయిన తరువాత టిష్యూ పేపర్ (Tissue paper) ను ఉంచిన ప్లేట్ లో తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని వడల్లా తయారు చేసుకోవాలి. అంతే వేడి వేడి క్రిస్పీ వడలు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వడలను ట్రై చేయండి.

click me!