చాలా మందికి ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ ఒక భేదిమందుగా పనిచేస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. కాఫీ మన కడుపును శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. అయితే చాలామంది మెడిసిన్స్ ను కూడా టీ, కాఫీలతో పాటుగా తీసుకుంటుంటారు. మీకు తెలుసా? టీ, కాఫీల్లో కెఫిన్, నికోటిన్, థియోబ్రోమైన్ తో పాటుగా 5 ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి మెడిసిన్స్ ప్రభావాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి శోషణను కూడా నివారిస్తాయి. అందుకే టీ, కాఫీలతో ఏయే మెడిసిన్స్ ను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
యాంటీ బయాటిక్స్
చాలా మంది యాంటీ బయోటిక్స్ ను తీసుకుంటుంటారు. అయితే వీళ్లు పక్కాగా టీ లేదా కాఫీతోనే వీటిని వేసుకుంటుంటారు. కానీ టీ, కాఫీలో లక్షణాలు యాంటీ బయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా మందులను తీసుకోవడం వల్ల సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.
Analgesic
ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి కొన్ని రకాల నొప్పి నివారణా మాత్రలను కూడా టీ లేదా కాఫీలతో తీసుకూడదు. ఎందుకంటే ఈ మందులను వీటితో తీసుకుంటే కడుపులో పుండ్లు ఏర్పడతాయి. అలాగే కడుపు చికాకు కలుగుతుంది.
థైరాయిడ్ మందులు
థైరాయిడ్ మందులను కూడా టీ, కాఫీలతో తీసుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల హైపోథైరాయిడిజం మందుల ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీ థైరాయిడ్ మందుల శోషణను సగానికి పైగా తగ్గిస్తుంది.
ఉబ్బసం మందులు
ఆస్తమా మెడిసిన్స్ ను కూడా టీ, కాఫీలతో పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎందుకంటే టీ, కాఫీలో ఉండే కెఫిన్ లో బ్రోన్కైటిస్ ఉంటుంది. ఇది ఈ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే తలనొప్పి, కడుపు నొప్పి, చికాకు, చంచలత వంటి సమస్యలను కలిగిస్తుంది.
డయాబెటిస్ మందులు
డయాబెటిస్ పేషెంట్లు కూడా తమ మందులను టీ, కాఫీలతో తీసుకోకూడదు. ఇది మీ శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. కాఫీ,టీలో ఉండే చక్కెర, పాల వల్ల ఇలా జరుగుతుంది. దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది మెడిసిన్స్ ప్రభావాన్ని కూడా బాగా తగ్గిస్తుంది.