రాత్రిపూట దాహం ఎక్కువగా అవుతుందా? అదే కారణం..

First Published | Aug 14, 2024, 3:28 PM IST

కొంతమందికి రాత్రిళ్లు విపరీతంగా దాహం అవుతుంటుంది. అలాగే నోరు, గొంతు బాగా ఎండిపోతుంటాయి. అందుకే వీళ్లు రాత్రిపూట బాగా నీళ్లను తాగుతుంటారు. అసలు రాత్రిపూట ఎందుకు ఎక్కువ దాహమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మందికి రాత్రిపూట ఎన్ని నీళ్లను తాగినా.. దాహమవుతూనే ఉంటుది. దీనివల్ల రాత్రిపూట తరచుగా నీళ్లను తాగాల్సి వస్తుంది. దీనివల్ల వీళ్లు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. ఏదేమైనా రాత్రిపూట పదే పదే దాహం కావడం అంత మంచి విషయమేమీ కాదు. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి ఇలా రాత్రిపూట పదేపదే దాహం కావడం ఎన్నో రోగాలకు సంకేతం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రక్తంలో చక్కెర స్థాయి పెరగడం

డయాబెటీస్ ఉన్నవారికి రాత్రిళ్లు విపరీతంగా దాహమేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల వీరు రాత్రిళ్లు ఎక్కువగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గుతాయి. నిజమేంటంటే? శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల దానిని మీ శరీరం  మూత్రం ద్వారా విడుదల చేయడం ప్రారంభిస్తుంది.  దీనివల్ల మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మీ శరీరం సాధారణం కంటే ఎక్కువ ద్రవాలను కోల్పోయినప్పుడు మీకు పదే పదే దాహంగా అనిపిస్తుంది. 
 


Hydrate


శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచకపోవడం

నీళ్లను సరిగ్గా తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీని వల్ల శరీరం సరిగ్గా పనిచేయదు. దీనివల్ల మీకు పదే పదే దాహంగా అనిపించడం మొదలవుతుంది. మీరు రోజుకు సరిపడా నీళ్లను తాగకపోవడం వల్ల మీ శరీరంలో మినరల్స్ లోపించి రాత్రిపూట ఎక్కువ దాహం అవుతుంది. 
 

రక్త లోపం

రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా రాత్రిపూట ఎక్కువగా దాహమవుతుంది. ఈ సమస్య వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో అలసట, సోమరితనంతో పాటుగా దాహం విపరీతంగా అవుతుంది. ఒంట్లో రక్తం తగ్గడం వల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల మీరు రాత్రిళ్లు నిద్రఉండదు. అలాగే దాహం కూడా ఎక్కువగా అవుతుంది. 
 


డిజిటల్ స్క్రీన్ 


చాలా మంది పడుకునేదాకా ఫోన్లను, ల్యాప్ టాప్ లను చూస్తూనే ఉంటారు. కానీ ఈ అలవాటు వల్ల శరీరం సెల్యులార్ స్థాయిలో నిర్జలీకరణానికి గురి అవుతుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు శరీరంలోని సెల్యులార్ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. అంతేకాదు ప్రాణాంతక వ్యాధులొచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. దీని వల్ల శరీరంలో ఫ్లూయిడ్ లాస్ పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో నీటి సమస్య బాగా పెరుగుతుంది.
 

శరీరంలో మినరల్స్ తక్కువగా ఉండటం 

మన శరీరంలో ముఖ్యమైన ఖనిజాలు తక్కువగా ఉండటం వల్ల కూడా రాత్రిళ్లు విపరీతంగా దాహమవుతుంది. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు మన శరీర పనితీరుకు చాలా చాలా అవసరం. ఇవి మన శరీరంలో ద్రవ సమతుల్యతను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మినరల్స్ తగ్గిపోవడం వల్ల రాత్రిళ్లు విపరీతంగా దాహం అవుతుంది. 

Latest Videos

click me!