అధిక రక్తపోటు లేదా హైబీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలు లేకుండా ప్రాణాలను రిస్క్ లో పడేయగలదు. ఈ హైబీపీ లక్షణాలు సంవత్సరాల పాటు కనిపించవు. కానీ ఈ వ్యాధి చాలా డేంజర్. ఈ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మంది దీన్ని నియంత్రించడానికి రెగ్యులర్ గా మందులను వాడుతుంటారు. కానీ మీరు ఎలాంటి మందులను వాడకుండా.. ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
blood pressure
ఉప్పు తక్కువగా..
చక్కెర, ఉప్పు మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు ఉప్పును వీలైనంత తక్కువగా తినాలి. అప్పుడే మీరు మందులు వాడకున్నా బీపీ అదుపులో ఉంటుంది. అలాగే మీ జీవనశైలి హెల్తీగా ఉండాలి. ఉప్పును ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య వస్తుంది. కాబట్టి మీరు తినే ఆహారంలో ఉప్పును తగ్గించండి.
blood pressure
పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం..
అధిక రక్తపోటు ఉన్నవారికి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. అందుకే మీ రోజువారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు చేర్చండి. అరటిపండ్లు, బచ్చలికూర, బఠానీల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
బరువు నియంత్రణ
బరువు పెరగడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి రక్తపోటును నియంత్రించడాలంటే ముందుగా మీరు బరువు పెరగకుండా చూసుకోవాలి. బరువు ఎక్కువగా ఉంటే.. తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాయామం, సైక్లింగ్, స్విమ్మింగ్ తో బరువు కంట్రోల్ అవుతుంది.
వ్యాయామం
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎక్సర్ సైజ్ మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచడంతో పాటుగా మిమ్మల్ని ఎన్నో వ్యాధులకు కూడా దూరంగా ఉంచుతుంది. ఇందుకోసం మీరు వారానికి కనీసం 5 రోజులు వ్యాయామం చేయండి.
high blood pressure
ధూమపానానికి దూరంగా
స్మోకింగ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా.. ఇది మీ రక్తపోటును కూడా పెంచుతుంది. కాబట్టి ఈ అలవాటు ఉంటే.. వెంటనే మానుకోండి. ఎందుకంటే స్మోకింగ్ లో ఉండే నికోటిన్ రక్తపోటును పెంచుతుంది.
Blood Pressure
ఒత్తిడికి దూరంగా..
ఒత్తిడి కూడా రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడి వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది గుండె పనితీరు కూడా ప్రభావితం చేస్తుంది. ఇది రక్తపోటును కూడా పెంచుతుంది.
blood pressure
జంక్ ఫుడ్
జంక్ ఫుడ్ టేస్టీగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీ రక్తపోటు అదుపులో ఉంచాలంటే జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి. అలాగే ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి. జంక్ ఫుడ్ కు పూర్తిగా దూరంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.