వాతావరణంలోని మార్పుల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్లను (Infections) తగ్గించడానికి చక్కటి పరిష్కారంగా వెల్లుల్లి టీ సహాయపడుతుంది. కనుక జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక కప్పు వెల్లుల్లి టీని తాగడం మంచిది. అలాగే అజీర్తి, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించి ఉదర ఆరోగ్యాన్ని (Abdominal health) మెరుగుపరుస్తుంది.