కీళ్ల నొప్పుల నుంచి కొలెస్ట్రాల్ వరకు.. ఈ రోగాలున్న వారికి ఫిష్ ఆయిల్ దివ్య ఔషదం..

First Published | Sep 26, 2023, 11:40 AM IST

చాలా మందికి చేపలంటే చాలా ఇష్టం. ఎందుకంటే చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే చేపనూనె చేపల కంటె మరింత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ నూనెలో ఎన్నో రోగాలను తగ్గించుకోవచ్చు. 
 

Image: Freepik

చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది అందరికీ తెలుసు. చేపల్లో మన శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. అయితే కొంతమంది మాంసం తిన్నా.. చేపలను మాత్రం అస్సలు తినరు. ఇలాంటి వారు చేప ఆయిల్ ను తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలను పొందుతారు. చేప ఆయిల్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 
 

fish oil

చేప నూనెను చేప కణజాలం నుంచి తయారు చేస్తారు. దీనిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్, కోసాపెంటెనోయిక్ యాసిడ్ ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి. ఫిష్ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


గుండె ఆరోగ్యానికి మేలు 

ఫిష్ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. చేప నూనెను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తప్పుతుంది. అలాగే ఈ ఫిష్ ఆయిల్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ ఆటోమెటిక్ గా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఫిష్ ఆయిల్ ను తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

మానసిక ఆరోగ్యానికి

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా ఫిష్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన మెదడు ఆరోగ్యానికి అవసరమయ్యే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ ను పదును పెట్టడానికి తోడ్పడుతాయి. మానసిక ఆరోగ్యం బాగా లేనివారిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఫిష్ ఆయిల్ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ಮೀನು ಸೇವನೆಮೀನಿನ ಕೊಬ್ಬು ಆರೋಗ್ಯಕರ ಚರ್ಮವನ್ನು ಕಾಪಾಡುತ್ತದೆ. ಅದರಲ್ಲೂ ಸಾಲ್ಮನ್ ಮತ್ತು ಇತರ ಮೀನಿನ ಎಣ್ಣೆಯಲ್ಲಿ ಸಿಗುವ ಒಮೆಗಾ 3 ಕೊಬ್ಬಿನಾಂಶದಿಂದಾಗಿ ಚರ್ಮವು ಮೃದುವಾಗಿಮತ್ತು ಎಸ್ಜಿಮಾದಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಸುಲಭಗೊಳಿಸುತ್ತದೆ.

కళ్లకు మేలు 

చేపలను తింటే మన కళ్లు బాగా కనిపిస్తాయి. కంటి సమస్యల ముప్పు కూడా తప్పుతుంది. ఎందుకంటే చేపల్లో కళ్లకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఈ పోషకం లేకపోవడం వల్ల కంటి వ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేప నూనె కూడా కళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరం

పుట్టబోయే బిడ్డ ఎదుగుదలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డిప్రెషన్, ఒత్తిడి వంటి లక్షణాలను తగ్గిస్తుంది. మీరు ప్రెగ్నెంట్ అయితే ఈ ఫిష్ ఆయిల్ ను తప్పకుండా మీ ఆహారంలో చేర్చండి. మీ బిడ్డ, మీరు ఆరోగ్యంగా ఉంటారు. 
 

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం 

ఫిష్ ఆయిల్ కూడా మన నూనె రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చేప నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లూ, జలుబు వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే ఇది మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
 

fish oil

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

కీళ్ల నొప్పుల వల్ల పడుకోవడం, నడవడం, కూర్చోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ నొప్పుల వల్ల వాపు, విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారికి చేప నూనె ప్రయోజకరంగా ఉంటుంది. ఈ నూనె కీళ్ల నొప్పులు, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

click me!