తులసి నీళ్లతో ఇన్ని లాభాలా? తాగకుండా అస్సలు ఉండలేరు

First Published | Sep 26, 2023, 7:15 AM IST

తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్కలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. 
 

Tulsi water

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. దీనికి రోజూ పూజ చేసే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాదు ఈ మొక్క మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మొక్కలో ఉండే ఔషదగుణాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలను తొందరగా తగ్గిస్తుంది. తులసి మంచి పోషకాలున్న మొక్క. అందుకే ఇది మన  మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం పరిగడుపున తులసి ఆకులతో కాచిన నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

tulsi water

తులసి వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు పరిగడుపున తులసి నీటిని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వాటర్ మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే దగ్గు, జలుబు, బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి కొన్ని శ్వాసకోశ వ్యాధులను నియంత్రించడానికి తులసి నీరు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసి నీటిని తాగడం వల్ల కఫం, దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. 

Latest Videos


తులసి ఆకుల్లో ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతే ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని అర్థం. తులసి వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మీ  రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. వ్యాధులు, ఇతర అంటువ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే వ్యాధులు చాలా తొందరగా తగ్గిపోతాయి. 
 

tulsi tea

తులసిలో యూజీనాల్ అనే సమ్మేళనం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

tulsi tea

తులసి వాటర్ కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. తులసి వాటర్ ను తాగడం వల్ల ఒత్తిడికి కారణమవయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. 

తులసిలో కార్మినేటివ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తులసి నీటిని తాగడం వల్ల జీర్ణసమస్యలు దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 

తులసిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే మన మొత్తం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. తులసి నీటిని తాగడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా నోట్లో నుంచి దుర్వాసన వచ్చే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. 

click me!