Beer: రోజూ బీర్ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా?

Published : Mar 09, 2025, 02:21 PM ISTUpdated : Mar 09, 2025, 02:34 PM IST

బీర్ చాలామందికి ఇష్టమైన డ్రింక్. ఎక్కువ శాతం యువత ఈ డ్రింక్ తాగుతుంటారు. అయితే చాలామందికి బీర్ తాగితే పొట్ట వస్తుందనే సందేహం ఉంటుంది. బీర్ తాగితే నిజంగా పొట్ట వస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
Beer: రోజూ బీర్ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా?

బీర్ చాలామందికి ఇష్టమైన డ్రింక్. వేసవి కాలంలో అయితే చాలామంది బీర్‌ తాగుతుంటారు. కొందరైతే చల్లటి బీర్ తాగి.. కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారు. కొందరికి బీర్ తాగడం ఇష్టమున్నా తాగితే పొట్ట వస్తుందనే కారణంతో కాస్త దూరంగా ఉంటారు. నిజంగా బీర్ తాగడం వల్ల పొట్ట వస్తుందా? ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం.

 

24
బీర్ తాగిన వెంటనే..

బీర్ తాగిన వెంటనే అది అన్ననాళం ద్వారా నేరుగా పొట్టకు వెళ్తుంది. ఆ తర్వాత బీర్‌లోని ఆల్కహాల్ నేరుగా రక్తంలో కలుస్తుంది. బీర్‌లోని మరో పదార్థమైన ఎసిటైల్ CoA నుంచి కొవ్వు ఉత్పత్తి అవ్వడం మొదలవుతుంది. ప్రతిరోజు బీర్ తాగేవాళ్లలో ఈ ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి.

34
బీర్ తాగితే పొట్ట వస్తుందా?

శరీరం మొదట ఆల్కహాల్‌ను కరిగించడానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఫలితంగా మిగిలిన ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకుండా కొవ్వుగా మారుతాయి. అందుకే పొట్ట వస్తుంది. అందుకే బీర్ తాగితే పొట్ట వస్తుందా అనే ప్రశ్నకు వైద్యులు అవునని సమాధానం చెబుతుంటారు. 

44
పొట్ట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

అధిక బరువు, పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్లు బీర్‌కు దూరంగా ఉండటం మంచిది. లైట్ ఫుడ్ తీసుకోవాలి. సన్నగా ఉన్నవాళ్లు బీర్ తాగితే ఫ్యాట్ ఉత్పత్తి కాదు అని కాదు. బీర్ ఫ్యాట్ పెంచుతుందనేది మాత్రం నిజం. 

Read more Photos on
click me!

Recommended Stories