మీరు చాలా ఒత్తిడిలో ఉన్నారు
ఒత్తిడి, ఆందోళనల వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. చాలామంది రాత్రిళ్లు ఆందోళనగా ఫీలవుతారు. ఒత్తిడి కనిపించకుండా మనల్ని దెబ్బ తీస్తుంది. ప్రశాంతత లేకపోతే సరిగా నిద్రపట్టదు. అందుకే.. ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి.
గది ఉష్ణోగ్రతను గమనించండి
పడుకునే గది చల్లగా ఉండాలి. వేడిగా ఉంటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే, చల్లగా ఉన్నా కూడా నిద్రకు ఇబ్బందిగా ఉంటుంది.