నాలుక రంగు అలా ఉంటే వ్యాధులున్నట్టేనా?

First Published Dec 14, 2023, 4:32 PM IST

డాక్టర్ దగ్గరకు వెలితే ఖచ్చితంగా మన నాలుకను చూస్తారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇలా ఎందుకు చూస్తారన్న డౌట్ ఎంతమందికి వచ్చింది. నిజమేంటంటే? మన నాలుక రంగును బట్టి మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయో అంచనా వేయొచ్చట. 
 

మనలో చాలా మంది పట్టించుకోకుండా వదిలేసే.. శరీరంలోని ఒక భాగం నాలుక. అవును కేవలం బ్రష్ చేసేటప్పుడు మాత్రమే నాలుకను క్లీన్ చేస్తాం. అంతే  ఆ తర్వాత నాలుక రంగు ఏమైనా మారిందా? ఏవైనా సమస్యలు వచ్చాయా? అని కూడా చూడరు. కానీ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే నాలుక కూడా ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. ఇది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్నిచూపుతుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల లోపాన్ని మన నాలుక మనకు చెప్తుందన్న ముచ్చట ఎంత మందికి తెలుసు? అసలు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పడు మన నాలుకను ఎందుకు చూస్తారో తెలుసా? మనకున్న సమస్యలను నాలుక ద్వారా తెలుసుకోవచ్చని. మరి మన నాలుక ఏ రంగులో ఉంటే సమస్యో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

తెలుపు రంగు..

మీ నాలుక పైభాగంలో  తెల్లటి పొరలాగ కనిపిస్తే మీరు నాలుకను సరిగ్గా క్లీన్ చేయడం లేదని అర్థం. అంటే ఇది మీరు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది. ఇలా నాలుకపై తెల్లని పొర ఉంటే.. మీ నాలుకపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని అర్థం. అలాగే మీరు తగినంత నీరు తాగకపోవడం వల్ల వచ్చే డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా నాలుక పై భాగం తెల్లగా మారుతుంది. 
 

స్ట్రాబెర్రీ టంగ్..

'స్ట్రాబెర్రీ టంగ్' అంటే చాలా మందికి తెలియదు. స్ట్రాబెర్రీల బయట ముళ్లలా కనిపించడం లేదా నాలుక గరుకుగా, సన్నని ముళ్లలాగ కనిపించడాన్నే స్ట్రాబెర్రీ టంగ్ అంటారు. ఇది విటమిన్లు.. ముఖ్యంగా బి విటమిన్లు తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది కవసాకి వ్యాధికి సంకేతం కూడా కావొచ్చు. ఈ వ్యాధి రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. పిల్లలే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటారు. 
 

నలుపు రంగు..

కొంతమంది నాలుక నల్లగా కనిపిస్తుంది. అలాగే కొద్దిగా వెంట్రుకలు పెరిగినట్టుగా కూడా కనిపింస్తుంది. నాలుక ఇలా కనిపించిందంటే మీరు స్మోకింగ్ చేస్తున్నట్టు. అలాగే కాఫీ లేదా టీ లను ఎక్కువగా తాగినా కూడా ఇలాగే అవుతుంది. అలాగే యాంటీబయాటిక్స్ వాడకాన్ని కూడా ఇది సూచిస్తుంది. 
 

tongue

నీలం రంగు..

మీ నాలుకపై కొద్దిగా నీలం లేదా ఊదా రంగు కనిపిస్తే.. మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయనడాన్ని సూచిస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన వ్యాధులను కూడా సూచిస్తుంది.

లేతరంగు..

నాలుక కూడా అప్పుడప్పుడు లేతగా కనిపిస్తుంది. ఇది రక్తహీనత లక్షణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి నాలుక మీలో ఇనుము లోపాన్ని సూచిస్తుంది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనత సమస్య వస్తుంది. అలాగే ఈ రంగు నాలుక రక్త ప్రవాహం సజావుగా లేదని, మీలో పోషకాలు తక్కువగా ఉన్నాయని సూచిస్తుంది.ఏదేమైనా మీకు మీరే నిర్ణయించుకోని టెన్షన్ పడకండి. డాక్టర్ వద్దకు వెళ్లి టెస్టులు చేయించుకున్నాకే కంఫార్మ్ చేసుకోండి.

click me!