1.ఎక్కువ మంది బరువు పెరగడానికి కారణం సాయంత్ర వేళ తినే తిండి. ఉదయం నుంచి పని చేసి, ఎక్కువగా సాయంత్రం, రాత్రివేళ ఫ్రీగా ఉంటారు. దీంతో, బోర్ కొడుతోందని ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దాని వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి. అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. సాయంత్రం వేళ వీలైనంత వరకు బిజీగా ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ ఉండటం వల్ల ఎక్కువ తినడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.