హై బీపి ఉన్నవాళ్లు కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Published : Jan 27, 2025, 01:04 PM IST

చాలా మందికి కాఫీ ఒక ఎమోషన్. కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలయ్యే వాళ్లు కూడా ఉంటారు కొందరు. మరి కాఫీ అంటే అమితమైన ఇష్టం ఉండి.. హై బీపీ ఉండేవారు కాఫీ తాగొచ్చా? తాగితే ఏమవుతుంది?

PREV
15
హై బీపి ఉన్నవాళ్లు  కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?

ప్రస్తుతం చాలా మంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ప్రధానమైనది హై బి.పి. దీన్ని సరిగ్గా చూసుకోకపోతే గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం. హైబీపి వల్ల శరీరంలోని ధమనులలో రక్త ప్రవాహం పెరిగి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. 

25
కంట్రోల్ చేయకపోతే...

హై బీపిని కంట్రోల్ చేయకపోతే, గుండె, రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు. కాబట్టి హైబీపిని కంట్రోల్ చేయడం అవసరం. సరైన ఆహారం, జీవనశైలి ఇందుకు ముఖ్యం. మరి హైబీపీ ఉన్నవాళ్లు కాఫీ తాగితే ఏమవుతుంది? వారిపై కాఫీ ప్రభావం ఎలా ఉంటుంది?

35
కాఫీ ప్రభావం

నిపుణుల ప్రకారం, కాఫీలో కెఫిన్ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. బీపిని తాత్కాలికంగా పెంచుతుంది. కెఫిన్ తీసుకున్న తర్వాత బీపి 3 గంటల వరకు పెరుగుతుందని ఒక అధ్యయనం కనుగొంది. హై బీపి. ఉన్నవాళ్లు కాఫీ తాగడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. తక్కువ మోతాదులో, జాగ్రత్తగా తీసుకుంటే సమస్య ఉండదు. రోజుకి ఒక కప్పు కాఫీ తాగితే ఉత్తమం.

45
గుండె సమస్యలు..

హై బీపి ఉండి.. రోజుకి 2 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగినవారితో, అసలు కాఫీ తాగని వారిని పోలిస్తే, హై బీపి ఉండే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, మరణం కూడా రావచ్చని ఒక పరిశోధనలో తేలింది. అయితే హై బీపి ఉన్నవాళ్లు రోజూ ఒక కప్పు కాఫీ లేదా గ్రీన్ టీ తాగితే గుండె జబ్బుల ప్రమాదం పెరగలేదట.

55
ఇవి పాటించండి

- హై బి.పి. ఉన్నవాళ్లు కాఫీ ఎక్కువగా తాగకండి. రోజుకి ఒక కప్పు మాత్రమే తీసుకోండి.

- కాఫీ తాగే సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి.

- సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లను పాటించండి.

Read more Photos on
click me!

Recommended Stories