వంటింట్లో ఉండే ఈ 2 పదార్థాలతో ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు మాయం

Published : Jan 27, 2025, 12:33 PM IST

సాధారణంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈజీగా కొవ్వును కరిగించుకోవచ్చనే విషయం మీకు తెలుసా?

PREV
16
వంటింట్లో ఉండే ఈ 2 పదార్థాలతో ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు మాయం

ప్రస్తుత లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కడిక్కడ పేరుకుపోయి చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. శరీరంలో కొవ్వు ఉండాల్సిన స్థాయిని దాటినప్పుడు రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఆరంభ దశలోనే కట్టడి చేయకపోతే తర్వాత తగ్గించడం చాలా కష్టమవుతుంది.

26
నరాల్లో కొవ్వు..

శరీరంలో కొవ్వు ఎక్కువైనప్పుడు అది నరాలలో పేరుకుపోయి.. గుండె జబ్బులు, రక్తపోటు, స్ట్రోక్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి.

36
చిటికెడు పసుపుతో..

వంటింట్లో ఉపయోగించే వాటిలో పసుపు ముఖ్యమైంది. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రధానంగా ఇందులో ఉండే కర్కుమిన్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీఅలెర్జిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో బాగా సహాయపడతాయి. దీనికోసం చిటికెడు పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతాయి.

46
పసుపు ప్రయోజనాలు

- పసుపులో ఉండే కర్కుమిన్ చెడు కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. ధమనులను శుభ్రపరుస్తుంది.

- ఇది జీవక్రియను వేగవంతం చేసి, బరువును నియంత్రణలో ఉంచుతుంది.

- పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

- పసుపు ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

- పసుపులో ఉండే లక్షణాలు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

గమనిక : పసుపును ఎక్కువగా తీసుకుంటే కడుపు సమస్యలు వస్తాయి. ఏదైనా అలెర్జీ లేదా ఆరోగ్య సమస్య ఉంటే, పసుపు నీళ్లు తాగే ముందు డాక్టరును సంప్రదించాలి.

56
మెంతులు

మెంతులు వంటింట్లో ఉపయోగించే మరో మసాలా దినుసు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అనేక విటమిన్లు వంటి వివిధ పోషకాలు మెంతుల్లో ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో కొవ్వును నియంత్రిస్తాయి. ముఖ్యంగా నరాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దీనికోసం ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నానబెట్టిన మెంతులను తినాలి. ఆ నీటిని కూడా తాగవచ్చు.

66
మెంతుల ప్రయోజనాలు

- మెంతుల్లో కరిగే ఫైబర్ ఉండటం వల్ల ఇది శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

-  మెంతులు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, అజీర్తి వంటి కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.

- నానబెట్టిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

- మెంతులను పేస్ట్‌లా చేసి జుట్టుకు రాసుకుంటే జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు సమస్యలను కూడా తొలగిపోతాయి.

గమనిక : మెంతులు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ, కొంతమందికి అది అలెర్జీని కలిగిస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మెంతులు తినే ముందు డాక్టర్ ను సంప్రదించడం చాలా ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories