చాక్లెట్ అందుకే తినాలనిపిస్తదా?

First Published | Aug 19, 2023, 4:24 PM IST

మన ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా చాలా అవసరం. మానసిక ఆరోగ్యానికి కూడా మెగ్నీషియం అవసరమని పలు అధ్యయనాలు చెబుతున్నారు. మన శరీరంలో మెగ్నీషియం లేకపోవడం వల్ల..

Magnesium

కొంతమంది చాక్లెట్లను ఇష్టంగా తింటుంటారు. కానీ చాక్లెట్లను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే చాక్లెట్ ను ఎక్కువగా తినాలనిపించడానికి శరీరంలో మెగ్నీషియం లోపించడం కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. చాక్లెట్ కోరికలు పెరగడానికి మెగ్నీషియం లోపం ఒక సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి. మెగ్నీషియం శరీరంలోని ఎన్నో విధులకు అవసరం. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. మానసిక ఆరోగ్యానికి మెగ్నీషియం కూడా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. మెగ్నీషియం టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడానికి, రక్తపోటును  కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి కూడా చాలా అవసరం.

మీ శరీరంలో అవసరమైన మొత్తంలో మెగ్నీషియం లేకపోతే.. శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. మెగ్నీషియం లేకపోవడం వల్ల ఎముక బలహీనత, కాల్సిఫికేషన్ ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గడం వల్ల రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. తలనొప్పి, వాంతులు, నిరాశ, ఆందోళన, అలసట వంటివి కూడా కొన్నిసార్లు మెగ్నీషియం లోపాన్ని సూచిస్తాయి. మీకు ఈ లక్షణాల్లో ఏవైనా ఉంటే మీకు మీరే మీ శరీరంలో మెగ్నీషియం పరిమాణం తక్కువగా ఉందని అనుకోండి. మెగ్నీషియం ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో 64 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం లోపాన్ని పోగొట్టుకోవడానికి డార్క్ చాక్లెట్ ను తినొచ్చు. డార్క్ చాక్లెట్ లో ఐరన్, కాపర్, ఫైబర్ కూడా ఉంటాయి.

విత్తనాలు 

ఫ్లక్స్ విత్తనాలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటి విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, కాల్షియం, జింక్, ఐరన్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

అరటిపండ్లు

అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటి పండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అరటి పండు మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఎన్నో పోషక లోపాలను పోగొడుతుంది.
 

బచ్చలికూర

బచ్చలికూర విటమిన్లు, పోషకాల భాండాగారం. బచ్చలికూరలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. బచ్చలికూరను తింటే ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. ఈ కూర పోషకాల లోపాన్ని పోగొడుతుంది.
 

గింజలు

రోజూ గుప్పెడు గింజలను తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే వీటిని మీ డైట్ లో చేర్చుకోండి. 
 

click me!