ధోమలు ఆ బ్లడ్ గ్రూప్ వారినే ఎక్కువగా కుడతాయా..?

Published : Aug 19, 2023, 02:29 PM IST

ఎంత మంది అక్కడ ఉన్నా, కొందరినే దోమలు కుడుతూ ఉంటాయి. అలా వారిని మాత్రమే దోమలు కుట్టడానికి, వారి బ్లడ్ గ్రూప్ కారణమట. 

PREV
17
  ధోమలు ఆ బ్లడ్ గ్రూప్ వారినే ఎక్కువగా కుడతాయా..?
Do Mosquitoes Prefer a Certain Blood Type


ఇళ్లు, రోడ్డు-వీధి, పార్కు ఇలా ఎక్కడ చూసినా దోమల బెడద ఎక్కువ అయిపోయింది. వర్షాకాలం వచ్చిందటే చాలు వీటి సంఖ్య మరింత పెరుగుతుంది. దోమల బెడద కారణంగా చాలా మందికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు.  ఈ చిన్న దోమ వల్ల మనుషులకు డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. కానీ దోమలు అందరినీ కుట్టవట తెలుసా?
 

27
mosquito

ఎంత మంది అక్కడ ఉన్నా, కొందరినే దోమలు కుడుతూ ఉంటాయి. అలా వారిని మాత్రమే దోమలు కుట్టడానికి, వారి బ్లడ్ గ్రూప్ కారణమట. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కొడుతూ ఉంటాయో, దీనిపై పరిశోధకులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...

37


దోమలు ఏ బ్లడ్ గ్రూప్‌కి ఎక్కువగా ఆకర్షితులవుతాయి?
దోమలు కొన్ని బ్లడ్ గ్రూపులకు చెందిన వారిని ఎక్కువగా కుడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దోమలు B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను చాలా తరచుగా గుర్తిస్తాయి. వారినే ఎక్కువగా కరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ బ్లడ్ గ్రూప్ ఇతర బ్లడ్ గ్రూపుల కంటే ఎక్కువ దోమలను ఆకర్షిస్తుంది. మరొక అధ్యయనం ప్రకారం, కొన్ని రకాల దోమలు O రకం రక్తం కలిగిన వ్యక్తులను కుడుతూ ఉంటాయట.
 

47
Here is a home remedy for swelling due to mosquito bites

ఈ బ్లడ్ గ్రూప్‌లోని వ్యక్తులు చర్మం ద్వారా కొన్ని రసాయనాలను స్రవిస్తాయి. ఉత్పత్తి చేయబడిన రసాయనాలు వారి రక్త వర్గాన్ని నిర్ణయించే DNA పై ఆధారపడి ఉంటాయి. 
 

57
New Research- Mosquitoes like the smell of your soap..


దోమ ఎప్పుడు ఎక్కువగా ఆకర్షిస్తుంది?

దోమలు సువాసనకు ఆకర్షితులవుతాయి: ఒక వ్యక్తి ముఖానికి పూసిన సబ్బు వాసన కూడా దోమలను ఎక్కువగా కుట్టేలా చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మనం ముఖానికి పెట్టుకునే సబ్బు దోమలను ఎలా ఆకర్షిస్తుందో తెలుసుకోవడానికి వర్జీనియా నిపుణులు నాలుగు ప్రముఖ సబ్బులను పరీక్షించారు. వీటిలో మూడు సబ్బులు దోమలను ఆకర్షిస్తాయని గుర్తించారు.
 

67
Image: Getty Images

పువ్వులు , పండ్ల సువాసన దోమలను ఇష్టపడుతుంది: దోమలు పండ్లు , పువ్వుల సువాసనగల సబ్బుల సువాసనను ఇష్టపడతాయని, కొబ్బరి సువాసన వాటిని తిప్పికొడుతుందని పరిశోధనలో తేలింది. కాబట్టి దోమల దాడి కూడా ఒక వ్యక్తి ఉపయోగించే సబ్బుపై ఆధారపడి ఉంటుంది.
 

77
Image: Getty Images

బీర్ వాసన: పరిశోధకులు దోమలపై చాలా పరిశోధనలు చేశారు. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలి నివేదిక ప్రకారం, మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ప్రజలు బీర్ తాగినప్పుడు దోమలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని నిపుణులు కనుగొన్నారు

click me!

Recommended Stories