దగ్గు ఎంతకీ తగ్గడం లేదా? అయితే మీరు ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..!

First Published | Sep 28, 2023, 2:39 PM IST

కొంతమందికి దగ్గు చాలా కాలం వరకు ఉంటుంది. ఈ దగ్గుతో పాటుగా శరీరం నొప్పులు, అలసట వంటి సమస్యలు ఉంటే మీరు కొన్ని టెస్టులను తప్పకుండా చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు రావడం చాలా సహజం. సీజన్లు మారుతుంటే ఈ సమస్యలు ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. అయితే దగ్గు కొంతమందికి ఎంతకాలమైనా తగ్గదు.  అదే తగ్గుతుందిలే అని ఊరుకోకుండా ఖచ్చితంగా హాస్పటల్ కు చూపించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దగ్గు ఎన్నో వ్యాధులకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. 

కొంతమంది దీర్ఘకాలిక దగ్గుతో  బాధపడుతుంటారు. ఈ దగ్గుతో పాటుగా ఒంటి నొప్పులు, అలసట వంటి సమస్యలు కూడా ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కొన్ని వ్యాదులకు సంకేతం కాబట్టి. ముఖ్యంగా ఈ సమస్య మీకు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లి విటమిన్ బి 12 టెస్టులు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మన శరీరంలో విటమిన్ బి12 అవసరమైన మొత్తంలో లేకపోవడం వల్ల కూడా దగ్గు ఎంతకీ తగ్గదట. ఇది పుష్కలంగా ఉంటే దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
 

Latest Videos


vitamin b12 deficiency

చాలా అధ్యయనాలు కూడా.. ఈ విటమిన్ బి 12 దగ్గు ను తొందరగా తగ్గించడానికి సహాయపడుతుందని వెల్లడించాయి. అయితే ఈ విటమిన్ బి 12 మన మూత్రం, చెమట ద్వారా శరీరం నుంచి త్వరగా బయటకు పోతుంది. అందుకే చాలా మందికి ఈ విటమిన్ బి12 లోపం ఉంటుందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అందుకే దీర్ఘకాలిక దగ్గు ఉంటే విటమిన్ బి 12 పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

cough

అయితే మనం ఎన్నో ఆహారాల ద్వారా విటమిన్ బి12 ను పొందొచ్చు. విటమిన్ బి 12 మన మెదడు, నరాల పనితీరుకు చాలా చాలా అయితే విటమిన్ బి 12ను  తిరిగి పొందడానికి మనం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన శరీరం నుంచి చాలా సులువుగా బయటకు పోతుంది. 

గుడ్లు, పెరుగు, సాల్మన్ వంటి ఒమేగా 3 కొవ్వు ఉన్న చేపలు,  చిక్కుళ్లు, కాయలు, విత్తనాల్లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు రోజుకు 0.4-1.2 మైక్రోగ్రాములు, కౌమారదశలో 12.1-8.2 మైక్రోగ్రాములు, పెద్దలకు 4.2 మైక్రోగ్రాముల విటమిన్ బి 12 అవసరమవుతుందని నిపుణులు అంటున్నారు. 

click me!