అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అల్లంలో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాదు అల్లంలో విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి అల్లం వాటర్ ను తాగడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అసలు అల్లం నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ginger water
ఇమ్యూనిటీ
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. దీంతో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే దీన్ని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.
జీర్ణసమస్యలు
అల్లం నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణ సమస్యలనేవే ఉండవు. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
ginger water
గొంతునొప్పి
అల్లం నీటి ఎన్నో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా సహాయపడతాయి. అల్లం వాటర్ లో తేనె కలుపుకుని తాగితే గొంతునొప్పి, దగ్గు తొందరగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
మలబద్దకం
అల్లంలో ఉండే ఔషదగుణాలు వికారం, వాంతులు, విరేచనాలు, గ్యాస్, అలసట, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలున్న వారికి అల్లం వాటర్ మంచి ఔషదంలా పనిచేస్తుంది.
ginger water
బ్లడ్ షుగర్
అల్లం వాటర్ మధుమేహులుకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అల్లంలో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉదయాన్నే పరగడుపున అల్లం నీళ్లను తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
ginge
బెల్లీ ఫ్యాట్
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు అల్లం నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది కేలరీలను బాగా బర్న్ చేస్తుంది. దీంతో సులువుగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
Image: Freepik
అధిక రక్తపోటు
రక్తపోటును తగ్గించడానికి కూడా అల్లం నీరు సహాయపడుతుంది. అల్లం నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగితే మీ ఆరోగ్యానికి ఏడాకా ఉండదు.