జీడిపప్పు ఎగ్ మసాలా ఇలా చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు.. సూపర్ టెస్ట్!

First Published Jul 1, 2022, 2:48 PM IST

జీడిపప్పుతో చేసుకునే ఎగ్ మసాలా రెసిపీ చాలా టేస్టీగా, క్రీమీగా భలే రుచిగా (Delicious) ఉంటుంది. తింటుంటే ఇంకాస్త తినాలనిపిస్తుంది.
 

ఈ రెసిపీని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం జీడిపప్పు ఎగ్ మసాలా (Cashew Egg Masala) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఆరు ఉడికించిన గుడ్లు (Boiled eggs), పదిహేను జీడిపప్పు (Cashew) పలుకులు, ఒక ఉల్లిపాయ (Onion), రెండు టమోటాలు (Tomatoes), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), ఒక స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక టీ స్పూన్ కసూరి మేథి (Kasuri Methi), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ పంచదార (Sugar), పావు స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ ల కారం (Chili powder).
 

ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ (Kashmiri chilli powder), సగం స్పూన్ గరం మసాల (Garam masala), ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), రెండు టేబుల్ స్పూన్ ల చిలికిన పెరుగు (Yogurt), ఒక టేబుల్ స్పూన్ బటర్ (Butter), రెండు టేబుల్ స్పూన్ ల ఫ్రెష్ క్రీమ్ (Fresh cream), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, పావు కప్పు నూనె (Oil).
 

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అరలీటర్ నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు (While boiling) ఇందులో ఉల్లిపాయ తరుగు, టమోటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు మిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, పంచదార, జీడిపప్పు పలుకులు, కొద్దిగా కసూరి మేథి వేసి బాగా ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 
 

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఉడికించిన గుడ్లు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి రెండు నిమిషాల పాటు గుడ్లను బాగా ఫ్రై (Fry) చేసుకోవాలి. గుడ్లు మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా నూనె వేసి చిలికిన పెరుగు వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత కారం, కాశ్మీర్ చిల్లీ పౌడర్, గరం మసాల, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కసూరి మేథి వేసి బాగా కలుపుకొని (Mix well) ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 
 

తరువాత ముందుగా గ్రైండ్ చేసుకుని వడగట్టుకున్న (Filtered) టమోటా జీడిపప్పు పేస్ట్, ఫ్రై చేసుకున్న గుడ్లు, సగం కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బటర్, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు తక్కువ మంట (Low flame) మీద కూర నుంచి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే జీడిపప్పు ఎగ్ మసాలా రెడీ.

click me!