ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మహిళల మరణానికి రొమ్ము క్యాన్సర్ ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రాణాంతక క్యాన్సర్. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఎంతోమంది ఈ రోగం బారిన పడుతున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందుకే దీని గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ ను రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. కాగా అక్టోబర్ 13 ను రొమ్ము క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళకలకు వచ్చే క్యాన్సర్ లలో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణమైనది. ఇది ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది. అయితే దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. మరి ఈ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి? ఈ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
breast cancer
రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి?
మాయో క్లినిక్ ప్రకారం.. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ముల కణాలలో ఏర్పడే ఒక రకమైన ప్రమాదకరమైన వ్యాధి. రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుంది. కానీ ఇది ఆడవారికే ఎక్కువగా వస్తుంది. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగే ఒక వ్యాధి. దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ రకాన్ని బట్టి రొమ్ములోని ఏ కణాలు క్యాన్సర్ గా మారుతుందనేది దానిపై ఆధారపడి ఉంటుంది.
breast cancer
రొమ్ము క్యాన్సర్ లక్షణాలు
రొమ్ము ఆకారం, పరిమాణంలో మార్పులు
రొమ్ములో బఠానీ గింజల్లాంటి చిన్న చిన్న గడ్డలు
రొమ్ము లోపల లేదా సమీపంలో, చంకల్లో గడ్డలు
రొమ్ము లేదా చనుమొనల చర్మం రంగులో మార్పులు
రొమ్ము లేదా చనుమొనల చర్మం ఎర్రబడటం.
రొమ్ము చర్మం గట్టిగా ఉంటుంది
చనుమొనల నుండచి రక్తస్రావం లేదా ద్రవాలు కారడం
ప్రమాద కారకాలు
వయస్సు: వయస్సుతో పాటుగా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ క్యాన్సర్ 50 ఏండ్లు పైబడిన మహిళలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
కుటుంబ చరిత్ర: మీ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టైతే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లి లేదా సోదరి వంటి దగ్గరి బంధువులకు క్యాన్సర్ వస్తే మీకు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
జెనెటిక్స్: బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 వంటి జన్యువులలో ఉత్పరివర్తనలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా పెంచుతాయి.
Breast Cancer
హార్మోన్ల కారకాలు: రుతుస్రావం త్వరగా ప్రారంభమైనా, ఆలస్యంగా రుతువిరతి వచ్చినా.. లేదా సంతానం కలగని మహిళలకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
జీవనశైలి కారకాలు: జీవనశైలి కారకాలు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతాయి. అంటే మందను ఎక్కువగా తాగడం, ఊబకాయం, నీటిని తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
breast cancer
రొమ్ము క్యాన్సర్ రావొద్దంటే?
పరీక్షలు: మీ రొమ్ము ఆకారం, రంగులో ఎలాంటి మార్పులు వచ్చినా వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. టెస్టులు చేయించుకోండి.
మామోగ్రామ్: మీకు 40 ఏండ్లు పైబడితే మీరు వార్షిక మామోగ్రామ్ చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్ ను మామోగ్రఫీ ద్వారా సులభంగా గుర్తిస్తారు. అలాగే సరైన సమయంలో చికిత్స కూడా తీసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం: రొమ్ము క్యాన్సర్ ను నివారించడానికి మీరు హెల్తీ ఫుడ్ ను తినాల్సి ఉంటుంది. అంటే మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని చేర్చండి. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి.
శారీరక శ్రమ: ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినడంతో పాటుగా ప్రతిరోజూ వ్యాయామం కూడా చేయాలి. శారీరక శ్రమ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు రోజుకు కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి.
breast cancer
ఆల్కహాల్ మానుకోండి: ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మందును పూర్తిగా మానేయండి. లేదా తగ్గించండి.
తల్లి పాలివ్వడం: ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు ఏవేవో కారణాల వల్ల బిడ్డలకు తల్లిపాలివ్వడం లేదు. తల్లిపాలివ్వడం వల్ల మీ బిడ్డకే కాదు మీకు కూడా ప్రయోజనం కలుగుతుంది. అవును పిల్లలకు పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
కుటుంబ చరిత్ర తెలుసుకోండి: మీ కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే.. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే మీరు ఎప్పటికప్పుడు అవసరమైన టెస్టులు చేయించుకోవాలి.
బరువును అదుపులో ఉంచుకోండి: ఊబకాయం కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతుంది. మీ బరువును అదుపులో ఉండాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ హెల్తీ ఫుడ్ ను తినాలి.
హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని నివారించండి: హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.