Tea: టీ చేయడానికి ఏ గిన్నె బెటర్?

Published : May 22, 2026, 07:49 PM IST

Tea: ఉదయం టీతోనే రోజు ప్రారంభించే వాళ్లు ఎక్కువ. కానీ టీ కాచే గిన్నె ఎంపిక కూడా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. అందుకే టీ చేయడానికి ఏ గిన్నె బెటర్? స్టీలా?అల్యూమినియమా? 

PREV
15
టీకి ఏ గిన్నె వాడితే మంచిది?

చాలా మంది జీవితాల్లో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం చిట్‌చాట్‌ల వరకు టీ తప్పనిసరి. అయితే టీ రుచి మాత్రమే కాదు, దాన్ని కాచే గిన్నె కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన పాత్రలో టీ తయారు చేస్తే ఆరోగ్య సమస్యల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

25
అల్యూమినియం గిన్నెలో టీ చేస్తున్నారా?

టీ తయారు చేసేటప్పుడు టీ పొడి, చక్కెర, అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలు వాడుతుంటాం. టీ పొడిలో వీటిలో ఉండే యాసిడ్స్ వల్ల అల్యూమినియం పాత్రలో ఎక్కువసేపు మరిగించినప్పుడు లోహంతో రసాయన చర్య జరిగే అవకాశం ఉంటుంది. దీంతో సూక్ష్మ లోహ కణాలు టీలో కలిసే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తరచుగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది. 

35
ఏయే జబ్బులు వస్తాయి?

ప్రతిరోజూ అల్యూమినియం గిన్నెలో చేసిన టీ తాగడం వల్ల దీర్ఘకాలంలో అనేక తీవ్రమైన జబ్బులు రావచ్చు. శరీరంలో అల్యూమినియం ఎక్కువగా చేరడం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు వస్తాయి. వీటివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఈ లోహం కడుపులోని పొరను దెబ్బతీస్తుంది. దీనివల్ల హైపర్-యాసిడిటీ, పెప్టిక్ అల్సర్, అజీర్తి, కొలైటిస్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. మన శరీరం అల్యూమినియంను సులభంగా బయటకు పంపలేదు. దీంతో అది కిడ్నీలలో పేరుకుపోయి వాటి పనితీరును దెబ్బతీస్తుంది.

45
టీ చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది?
టీ చేయడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెనే అత్యుత్తమమైనది, సురక్షితమైనదిగా నిపుణులు చెబుతున్నారు.
55
గమనించండి

స్టీల్ ఒక ‘నాన్-రియాక్టివ్’ లోహం. అంటే, టీ ఆకుల్లోని యాసిడ్‌తో ఇది ఎలాంటి రసాయన చర్య జరపదు. స్టీల్ గిన్నెలో టీ మరిగించడం వల్ల ఎలాంటి హానికరమైన పదార్థాలు మీ టీలో కలవవు. దీనివల్ల టీ అసలైన రుచి, మీ ఆరోగ్యం రెండూ భద్రంగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories