పుల్లపుల్లగా ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర చేపల పులుసు.. ఇలా చేస్తే అదిరిపోతుంది!

First Published Jun 28, 2022, 3:02 PM IST

చేపల పులుసు తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. అయితే చేపలతో ఎప్పుడూ చేసుకునే వంటలకు బదులుగా ఈ సారి గోంగూరతో చేపల పులుసును ట్రై చేయండి.
 

ఈ రెసిపీ పుల్లపుల్లగా భలే రుచిగా (Delicious) ఉంటుంది. ఈ రెసిపి తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు గోంగూర చేపల పులుసు (Gongura chepala pulusu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: అరకేజీ శుభ్రం చేసిన  చేపలు (Fish), ఒక కట్ట ఎర్ర గోంగూర (Red Gongura), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion) తరుగు, రెండు టమోటాల (Tomatoes) పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), రెండు స్పూన్ ల అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), రెండు టేబుల్ స్పూన్ ల కారం (Chili powder).
 

సగం స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ వేయించిన మెంతి పొడి (Fenugreek powder), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), ఒక స్పూన్ ఆవాలు (Mustard), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, పావు కప్పు నూనె (Oil).
 

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శుభ్రం చేసిన చేపలు (Cleaned fish), ఒక స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి చేప ముక్కలకు మసాలాలు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె (Oil) పోసి వేడెక్కిన తరువాత చేప ముక్కలను వేసి తక్కువ మంట మీద ఎర్రగా వేపుకోవాలి.
 

చేప ముక్కలు రెండు వైపులా బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొంత నూనె వేసి వేగిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి మంచి కలర్ వచ్చాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకు ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

తరువాత ఎర్ర గోంగూరను వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు, వేయించిన మెంతి పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని (Mix well) టమోటా పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. టమోటా పేస్ట్ బాగా మగ్గిన తరువాత ఒకటిన్నర గ్లాసు నీళ్లు (Water) పోసి బాగా మరిగించికోవాలి.
 

మసాలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకొన్న చేపముక్కలను వేసి తక్కువ మంట  (Low flame) మీద 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చేపలు బాగా ఉడికి కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర (Coriander) తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పుల్లటి గోంగూర చేపల పులుసు రెడీ.

click me!