వెన్ను నొప్పి తగ్గేందుకు తమలపాకులు.. ఎలా ఉపయోగించాలంటే?

First Published Dec 7, 2021, 3:40 PM IST

తమలపాకులను (Betel leaf) నిత్యం మనము పూజలకి, తాంబూలం కోసం వాడుతుంటాం. ఇలా ఉపయోగించే ఈ తమలపాకులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని అనేక జబ్బులను నయంచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తమలపాకులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ,సి, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. తమలపాకులు శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. జ్వరాన్ని, మూత్ర సమస్యలను, గుండె సమస్యలను తగ్గించడానికి తమలపాకు సహాయపడుతుంది. అయితే తమలపాకులో సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను కలిపి అధిక మొత్తంలో తీసుకుంటే శరీరానికి హాని కలిగిస్తాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తమలపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.. 
 

శ్వాస సంబంధిత సమస్యలు: గోరువెచ్చని ఆవనూనెలో (Castor oil) తమలపాకులను నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఎద మీద రాసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల (Respiratory problems) నుంచి విముక్తి కలుగుతుంది. అదే తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, కఫం, శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేయడానికి తమలపాకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

వెన్ను నొప్పి: వేడిగా ఉండే తమలపాకు రసాన్ని (Betel juice) కొబ్బరి నూనెతో (Coconut oil) కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని వెన్నుకు బాగా మసాజ్ చేసుకోవాలి. దీంతో వెన్ను నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. పాలిచ్చే తల్లులలో రొమ్ముల్లో పాలు గడ్డ కట్టి నొప్పి కలిగిస్తుంటే తమలపాకును కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.  

తలనొప్పి: తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలగడానికి చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకట్టుకోవాలి. ఇలా చేయడంతో తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి (Headache) నుంచి విముక్తి కలుగుతుంది. తమలపాకు రసాన్ని (Betel juice) ముక్కులో డ్రాప్స్ గా తీసుకోవాలి. ఇలా చేయడంతో తల నొప్పి నుంచి విముక్తి కలగడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 

గాయాలు: తగిలిన గాయాలను నయం చేయడానికి తమలపాకు సహాయపడుతుంది. తమలపాకులకు నెయ్యిరాసి గాయం (Injury) తగిలిన ప్రదేశంలో కట్టుకట్టాలి. ఇది గాయాలను తగ్గించడంతో పాటు వాపు (Swelling) నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
 

ఓరల్ హెల్త్: తమలపాకును భోజనం తరవాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది నోటిని శుభ్రపరచడంతో పాటు జీర్ణక్రియను (Digestion) మెరుగుపరుస్తుంది. తమలపాకు ఓరల్ హెల్త్ (Oral Health) కి మంచిది. అయితే ఎక్కువ మొత్తంలో తాంబూలాన్ని సేవించడం మంచిది కాదని వైద్యులు తెలుపుతున్నారు.
 

చర్మ సమస్యలను నివారిస్తుంది: చర్మంలోని బ్యాక్టీరియా కారణంగా ఏర్పడే తామర, దురద, వంటి చర్మ సమస్యలను (Skin problems) నయం చేయడానికి తమలపాకు రసం చక్కగా పనిచేస్తుంది. తమలపాకు ముద్దను తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు (Dandruff) నుంచి విముక్తి కలుగుతుంది.

click me!