చర్మ సౌందర్యానికి మెంతులు వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

First Published Dec 5, 2021, 3:30 PM IST

 వంటింట్లో అందుబాటులో ఉండే మెంతులు (Fenugreek) చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. మెంతులలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. మెంతులను ఆయుర్వేదిక్ ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. మెంతులలో ఉండే పోషకాలు చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మసౌందర్యాన్ని పెంచుతాయి. చర్మ సౌందర్యానికి మెంతులు సహజసిద్ధమైన ప్యాక్ గా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు చర్మసౌందర్యానికి మెంతులు చేసే ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం.. 
 

అందరిలో అందమైన ముఖంతో కాంతివంతంగా కనపడాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారు ఆర్టిఫిషియల్ క్రీమ్స్ (Artificial creams) లో వాడకం తగ్గించి ఇలా ఇంటిలోనే సహజసిద్ధమైన రేమిడిస్ లను వాడడం ఉత్తమం. కలుషిత వాతావరణం కారణం, పోషకాలు లోపించడం వంటి అనేక కారణాలతో చర్మ సౌందర్యం (Skin beauty) దెబ్బతింటోంది. దాని ఫలితంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడుతున్నాయి. ఇలాంటి చర్మ సమస్యల నుంచి శాశ్వతంగా పరిష్కారం పొందేందుకు మెంతులు చక్కగా సహాయపడతాయి. 

మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది : చర్మ సౌందర్యం కోసం ముందుగా 20 నిమిషాలపాటు పాలలో (Milk) మెంతులను నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మెంతులను (Soaked fenugreek) మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం తో ముఖం పై ఏర్పడిన మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
 

క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది: మెంతులు చర్మంలో పేరుకుపోయిన మలిన పదార్థాలను (Impurities) బయటకు పంపించి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ముందుగా నానబెట్టుకొన్న మెంతులను పేస్ట్ చేసి ఈ పేస్ట్ లో పాల మీగడ వేసి కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేయడంతో ఇది మన చర్మానికి మంచి క్లెన్సర్ (Cleanser) గా సహాయపడుతుంది.

స్కిన్ టోన్ వైట్ గా మారుతుంది: మెంతులు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని తెల్లగా మార్చడానికి సహాయపడతాయి. నాన పెట్టుకున్న మెంతులను మిక్సీలో వేసి ఇందులో పెరుగు (Curd) వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇది చర్మానికి (Skin) మంచి మెరుపును అందించి స్కిన్ టోన్ వైట్ గా మార్చుతుంది .
 

సన్ టాన్ తొలగిస్తుంది: ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లు పోసుకుని మెంతులు (Fenugreek) నానబెట్టుకుని తర్వాత స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. నీరు బాగా మరిగి సగం గ్లాసు అయిన తరువాత నీటిని చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయిన నీటిని ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా చేయడంతో సన్ టాన్ (Sun Tan) తొలగిపోతుంది.

click me!