ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం లడ్డు ఎలా తయారు చెయ్యాలో మీకు తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 07, 2021, 03:08 PM IST

లడ్డు అనే పేరు వినగానే అందరికీ తినాలనే కోరిక పెరుగుతుంది. లడ్డూలంటే అందరికీ ఇష్టం ఉంటుంది మరి. మనం రొటీన్గా బూందీ లడ్డు, రవ్వ లడ్డు ఇలా ట్రై చేస్తుంటాం. ఈసారి కొత్తగా వెరైటీగా సగ్గుబియ్యంతో లడ్డూలను తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా సగ్గుబియ్యం లడ్డులను (Stuffed laddu) ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..  

PREV
16
ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం లడ్డు ఎలా తయారు చెయ్యాలో మీకు తెలుసా?

ఈ లడ్డూలను తక్కువ సమయంలో చాలా సులభమైన పద్ధతిలో (Easy method) తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో తయారుచేసుకునే లడ్డూలు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఒక మంచి హెల్తీ స్వీట్ ఐటమ్ (Healthy Sweet Item). ఈ లడ్డూలను తినడానికి మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం ఈ లడ్డూల తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
 

26

కావలసిన పదార్థాలు: ఒక కప్పు సగ్గుబియ్యం (Stuffed), ఒక కప్పు చక్కెర (Sugar), రెండు టేబుల్ స్పూన్ ల బొంబాయి రవ్వ (Bombayi ravva), చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ (Orange Food కలర్,), పది జీడిపప్పు పలుకులు (Cashew nuts), సరిపడు నెయ్యి (Ghee).
 

36

తయారీ విధానం: ముందుగా అరగంట ముందు  సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని (Soaked stuffed) నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి (Ghee) వేసి వేడి చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
 

46

ఇప్పుడు అదే కడాయిలో మరికొంత నెయ్యి వేసి వేడిచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి తడిపోయే వరకు (Until wet) వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బొంబాయిరవ్వ కూడా వేసి వేయించాలి. సగ్గు బియ్యం, బొంబాయి రవ్వ వేగిన తరువాత ఇందులో చక్కెర (Suger) వేసి కలుపుకోవాలి.
 

56

చక్కెర బాగా కరిగిన తరువాత (After dissolving) ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్, జీడిపప్పు పలుకులు వేయాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ అడుగంటకుండా చూసుకోవాలి. మిశ్రమం అంతా దగ్గరకు వచ్చాక ఇందులో జీడిపప్పు పలుకులను (Cashew nuts) వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిశ్రమమంతా చల్లారాక కొద్దిగా వేడిగా ఉన్న సమయంలో చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి.
 

66

లడ్డూలపైన జీడిపప్పులను గార్నిష్ (Garnish) కోసం ఉంచితే లడ్డూలు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే సగ్గుబియ్యం లడ్డు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సగ్గుబియ్యం లడ్డు ఒక హెల్తీ స్వీట్. ఈ లడ్డూలను పండుగ సమయంలో దేవునికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఇంటికి వచ్చిన అతిథులకు, బంధువులకు పెట్టేందుకు ఈ స్వీట్ బాగుంటుంది. దీని రుచి కూడా బాగుంటుంది.

click me!

Recommended Stories