ఆల్కహాల్ తీసుకోవడం వలన మనిషి ఆరోగ్యంతో పాటు ఇంకా చాలా కోల్పోవలసి వస్తుంది. అయినా అలవాటైనా ప్రాణం ఆల్కహాల్ తీసుకోకుండా ఉండలేదు. అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మితంగా తాగుతూ మెల్లిమెల్లగా అలవాటు నుంచి ఏం బయటపడటం అనేది చాలా అవసరం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తాగిన ఆల్కహాల్ ఒంటికి పట్టకుండా నిరోధించవచ్చు.
అదెలా అంటే ఖాళీ కడుపుతో ఎప్పుడూ మద్యాన్ని సేవించకండి. ఆల్కహాల్ తాగే ముందు గుడ్లు తినడం మంచిది. కడుపు నిండితే ఆల్కహాల్ తీసుకోవడం తగ్గుతుంది. అలాగే ఖాళీ కడుపుతో సేవిస్తే శరీర సమతుల్యతని కోల్పోతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకునే ముందు అరటిపండుని తినడం కూడా చాలా మంచిది
ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది మరియు డిహైడ్రేషన్ కి కారణం అవుతుంది. అరటిపండ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను నివారించడంతో పాటు డిహైడ్రేషన్ తగ్గడానికి తోడ్పడుతుంది.
ఆల్కహాల్ తీసుకునే ముందు పెరుగుని తీసుకుంటే ఆల్కహాల్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. డ్రింక్ చేసే ముందు సాల్మన్ చేపని తినడం కూడా మంచిది. ఇది ఆల్కహాల్ యొక్క ప్రతికూల ప్రభావాలని నివారిస్తుంది. సాల్మన్ చేపలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే ఒమేగా ఫ్యాటీ త్రి యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇది ఆల్కహాల్ శరీరం త్వరగా గ్రహించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే ఓట్స్ తినడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్కహాల్ కాలేయాన్ని ప్రభావితం చేయకుండా నివారించవచ్చు. అలాగే డ్రింక్ చేసేముందు పుచ్చకాయ లేదా కీర దోసకాయ తినటం చాలా మంచిది. శరీరంలో నీటి శాతాన్ని మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.
అలాగే శరీరానికి పోషకాలు కూడా అందుతాయి. అలాగే మద్యం సేవించడానికి ముందు బెర్రీలు తినడం వలన శరీరంలోని డిహైడ్రేషన్ నివారించవచ్చు. ఇదంతా మేము ఆల్కహాల్ ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినది కాదు కేవలం అవగాహన కోసం మాత్రమే.