Health Tips: వ్యాయామానికి బద్దకిస్తున్నారా.. అయితే ఈ చిట్కాల తో చురుగ్గా కదలండి!

First Published | Nov 1, 2023, 10:10 AM IST

Health Tips: సాధారణంగా వ్యాయామం చేయాలి అని అందరూ అనుకుంటారు కానీ చేసే సమయం దగ్గరకు వచ్చేసరికి బద్ధకం వలన వ్యాయామానికి ఒళ్ళు సహకరించదు అయితే ఈ చిట్కాలు పాటిస్తే చురుగ్గా వ్యాయామానికి వెళ్తారు అది ఎలాగో చూద్దాం.
 

tips-for-waking-up-earlier-to-workout- gnr

 మామూలుగానే అందరికీ యాక్టివ్ గా ఉండాలని బాడీని ఫిట్ గా ఉంచుకోవాలని మనసులో ఆశ అయితే ఉంటుంది. కానీ ఒంట్లో ఉండే బద్ధకం ఒక అంతట వ్యాయామానికి లేదంటే జిమ్ కి వెళ్ళటానికి సహకరించదు. అయితే ఈ చిట్కాలు పాటిస్తే చురుగ్గా లేచి వ్యాయామానికి వెళ్తారు. అవేమిటంటే మీ జిమ్ ట్రైనర్ కి ముందుగానే డబ్బులు చెల్లించండి.
 

 కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనే ఉద్దేశంతో అయినా జిమ్ కి వెళ్లాలని ఆలోచన వస్తుంది. వర్కౌట్ కి తీసుకువెళ్ల దుస్తులను మీ పంచం పక్కన పెట్టుకోండి. కళ్ళు తెరవగానే వేరే వ్యాపకం పెట్టుకోకుండా ఆ బట్టలు కనిపిస్తే వెంటనే వ్యాయామానికి బయలుదేరుతారు.
 


ముందు రోజు రాత్రి మనసులో ప్లాన్ చేసుకోండి, రేపు కచ్చితంగా వ్యాయామానికి వెళ్లాలి,ఎందుకు వెళ్లాలి అనేది కూడా మనసులో చెప్పుకోండి విజువలైజేషన్ నిర్దిష్టంగా ఉంటే బాడీ అందుకు సహకరిస్తుంది. పొద్దున్న వర్క్ అవుట్ చేయాలి కచ్చితంగా నేను లేవాలి అని నిద్రలోకి జారుకుంటున్నప్పుడే మనం మనసులో గట్టిగా అనుకుంటే కచ్చితంగా మరుసటి రోజు పొద్దున్న లేస్తాం.

 ఈ ఒక్క పూట చేయడం మానేస్తే ఏమిటి నష్టం అనుకోవడం సహజం అయితే ఒకరోజు బద్ధకం మరుసటి రోజుకి కూడా రావచ్చు, అదే బద్ధకం ఎక్కువై మొత్తం వ్యాయామానికి చెక్ పెట్టవచ్చు కాబట్టి వ్యాయామానికి ప్రతి ఒక్కరోజూ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి.
 

రోజూ అలారం పెట్టుకుని ఒకే సమయానికి నిద్ర లేవండి. అలా చేయడం వలన శరీరంలోని జీవ గడియారం ఆ సమయానికి అలారం లేకపోయినా మిమ్మల్ని నిద్ర లేపుతుంది. లేచిన వెంటనే ఫోన్ చూసుకోకుండా ఏ పని మీద లేచేమో ఆ పని మీద చురుగ్గా కదలండి.
 

 ఐదు నిమిషాలు అంటూ ఫోన్ పట్టుకుంటే తెలియకుండానే గంటలు గడిచిపోతాయి కాబట్టి ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటించి వ్యాయామానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి.

Latest Videos

click me!