ఆహారం ద్వారా వివిధ రూపాల్లో కొవ్వులు శరీరంలోకి చేరుతాయి. ధాన్యాలు, పాలు మొదలైన వాటిలో కనిపించని కొవ్వులు ఉంటాయి. నూనె, నెయ్యి వంటి వాటిలో కనిపించే కొవ్వులు ఉంటాయి. చెడు కొవ్వులు ఎక్కువగా మాంసాహారం నుంచి వస్తాయి. అయితే ఈ క్రమంలో నూనె నుంచి చెడు కొవ్వులు వస్తాయని ఏ నూనె వాడాలి అని చాలామందికి తెలియదు.