ముడతలు రాకుండా యవ్వనంగా కనిపించాలంటే ఈ బ్యూటీ టిప్స్ పాటించండి!

First Published Dec 29, 2021, 2:47 PM IST

రోజురోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం కారణంగా చర్మకణాలలో దుమ్ము, ధూళి పేరుకుపోయి చర్మ సమస్యలు (Skin problems) ఎదురవుతున్నాయి. వీటి కారణంగా ముఖచర్మంపై ముడతలు ఏర్పడి యుక్తవయస్సులోని వృద్ధాప్య లక్షణాలు కనబడుతున్నాయి.
 

ఇలాంటి చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడం మంచిది కాదు. ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకుని కొన్ని బ్యూటీ టిప్స్ (Beauty Tips) ను అనుసరిస్తే చర్మ సౌందర్యానికి మంచి ఫలితం లభిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అదేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు కారణంగా ముఖం అందవిహీనంగా (Unattractive) తయారవుతుంది. వీటి కారణంగా చిన్న వయసులోనే వయస్సు పైబడిన వారిలా కనిపిస్తారు. ఇలాంటి చర్మ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం పొందడానికి ఇంటిలోని సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించడం మంచిది.
 

ఇది చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను (Dead cells) తొలగించి చర్మ సమస్యలను తగ్గించి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి. అయితే వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

మృదువైన చర్మం కోసం: ఒక కప్పులో బంగాళాదుంప గుజ్జు (Potato pulp), రెండు స్పూన్ ల ఓట్స్ పొడి (Oatmeal), రెండు స్పూన్ ల పాలు (Milk), కొంచెం తేనె (Honey), కొన్ని చుక్కల ఆలివ్ నూనె (Olive oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేసే చర్మం మృదువుగా మారి  అందంగా కనిపిస్తుంది.  
 

ముడతలను తగ్గిస్తుంది: ఒక కప్పులో బొప్పాయి గుజ్జు (Papaya pulp), కొద్దిగా బియ్యపు పిండిని (Rice flour) వేసి బాగా  కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై ముడతలు తగ్గి చర్మం బిగుతుగా తయారవుతుంది. దీంతో ముఖంపై వృద్ధాప్య లక్షణాలు తగ్గిపోతాయి. 
 

మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి: ఇందుకోసం ఒక కప్పులో బాగా పండిన బొప్పాయి గుజ్జు (Papaya pulp), తేనె (Honey), పెరుగు (Curd) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. బొప్పాయి గుజ్జు చర్మానికి సహజ ఫీలింగ్ ఏజెంటుగా సహాయపడుతుంది. ఇది ముఖం పై మొటిమలు మచ్చలను తొలగించి చర్మం సౌందర్యాన్ని పెంచుతుంది.
 

చర్మాన్ని తాజాగా ఉంచుతుంది: కలుషిత వాతావరణం కారణంగా చర్మకణాలులో మురికి పేరుకుపోతుంది. చర్మాన్ని శుభ్రపరచడం కోసం ఒక కప్పులో టమోటా గుజ్జు (Tomato pulp), కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో ముఖానికి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇది చర్మ కణాలు పేరుకుపోయి ఉన్న మురికిని తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

click me!