క్యారెట్ చాక్లెట్ కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఎలానో చూడండి?

First Published Dec 28, 2021, 4:56 PM IST

ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున కేక్ కట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితులలో బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. కాబట్టి కేక్ ను బయట నుంచి తెచ్చుకునే బదులుగా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇలా కేక్ తయారు చేసుకోవాలనుకునప్పుడు క్యారెట్ చాక్లెట్ కేక్ (Carrot chocolate cake) ను ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఈ కేక్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: మూడు కప్పులు క్యారెట్ తురుము (Carrot grater), నాలుగు గుడ్లు (Eggs), ఒకటిన్నర కప్పు మైదా (Maida), రెండు కప్పులు చక్కెర పొడి (Sugar powder), అర కప్పు చాక్లెట్ పొడి (Chocolate powder), ఒకటిన్నర చెంచా బేకింగ్ పౌడర్ (Baking powder), ఒకటిన్నర చెంచా వంట సోడా (cooking sode).
 

చిటికెడు ఉప్పు (Salt), రెండు స్పూన్ ల దాల్చినచెక్క పొడి (Cinnamon powder), ఒకటింపావు కప్పు నూనె (Oil), రెండు టేబుల్ స్పూన్  డ్రై ఫ్రూట్స్ (Dry Fruits), ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ (Vanilla Essence), సగం స్పూన్  వెన్న (Butter). కేక్ ఐసింగ్ కోసం: సగం కప్పు చక్కెర పొడి (Powdered sugar), సగం కప్పు వెన్నె (Butter). 
 

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో మైదా, వంటసోడా, చాక్లెట్ పొడి, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి జల్లెడ (sieve) పట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో గుడ్డు సోన, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్, చక్కెర పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి (Mix well). ఇలా కలుపుకున్న మిశ్రమంలో జల్లెడ పట్టిన పిండిని వేసి బాగా కలుపుకోవాలి.
 

మిశ్రమాన్ని ఒకే డైరెక్షన్ లో ఉండలు (lump) లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్, క్యారెట్ తురుము వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ పాత్ర తీసుకుని వెన్న రాసుకోవాలి. ఈ వెన్న (Butter) రాసిన బేకింగ్ పాత్రలో మిశ్రమాన్ని వేయాలి.
 

ఇప్పుడు ఈ బేకింగ్ పాత్రలను ముందుగా వేడి చేసి పెట్టుకన్న ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ (Bake) చేసుకోవాలి. 45 నిమిషాల తరువాత బేకింగ్ పాత్రను బయటకు తీసి చల్లారాక కేక్ ను ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు కేక్ (Cake) ను రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి.
 

కేక్ ఐసింగ్ (Icing) కోసం ఒక గిన్నెలో వెన్న చిక్కటి పొడి తీసుకుని బాగా గిలకొట్టాలి. ఈ ఐసింగ్ మిశ్రమాన్ని కట్ చేసుకున్న కేక్ భాగం పై రాసి మరో కేక్ భాగాన్ని దాని పై ఉంచి మిగిలిన ఐసింగ్ మిశ్రమాన్ని రాసుకోవాలి. పై భాగాన్ని డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ (Garnish) చేయాలి. అంతే క్యారెట్ చాక్లెట్ కేక్ రెడీ. ఈ కేక్ ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

click me!