ఆముదం గింజల నుంచి ఈ నూనెను తయారు చేస్తారు. ఈ నూనె మాడుకు తగిన పోషణను అందించి జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆముదంలో యాంటీ వైరల్ (Antiviral), యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial), యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలలో ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే దురద, మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి.