బొప్పాయి గుజ్జు, తేనె, పచ్చి పాలు: ఒక కప్పులో అర కప్పు బొప్పాయి గుజ్జు (Papaya pulp), ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey), రెండు టీ స్పూన్ ల పచ్చి పాలను (Milk) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే పొడి చర్మ సమస్యలు తగ్గి చర్మం కోమలంగా మారుతుంది.