తెలంగాణ స్టైల్ స్పైసీ నాటుకోడి కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

Published : Jun 01, 2022, 02:41 PM IST

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందులోనూ నాటుకోడి అంటే తినడానికి మరి ఇష్టపడతారు.  

PREV
18
తెలంగాణ స్టైల్ స్పైసీ నాటుకోడి కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

తెలంగాణ స్టైల్ లో చేసుకునే నాటుకోడి కూర చాలా స్పైసీగా (Spicy) భలే రుచిగా ఉంటుంది. ఈ కూరను తక్కువ పదార్థాలతో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర (Telangana Style Natukodi Kura) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

28

కావలసిన పదార్థాలు: అరకేజీ నాటుకోడి (Natukodi), పదిహేను ఎండు మిరపకాయలు (Dried chillies), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), ఒక టమోటా (Tomato), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), పదిహేను వెల్లుల్లి (Garlic) రెబ్బలు.
 

38

ఒక రెబ్బ కరివేపాకులు (Curries), ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి (Coriander powder), పావు స్పూన్ పసుపు (Turmeric), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక టీస్పూన్ గరం మసాలా (Garam masala), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, పావు కప్పు నూనె (Oil).
 

48

తయారీ విధానం: ముందుగా అరగంట ముందు ఎండుమిరపకాయలు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో  వెల్లుల్లి రెబ్బలు, టమోటా, నానబెట్టుకున్న ఎండు మిరపకాయలు (Soaked dried chillies), కొన్ని నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి. 
 

58

ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసుకొన్న ఉల్లిపాయ తరుగు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు తరుగు, కరివేపాకు రెబ్బలు వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై (Fry) చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

68

ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పొడి,  ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి రెండు నిముషాలు తక్కువ మంట (Low flame) మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని (Mix well) రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
 

78

ఇప్పుడు తక్కువ మంటమీద కూరను పది   నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ఒక కప్పు నీళ్లు (Water) పోసి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఐదు విజిల్స్ (Whistles) వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి కూర మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి.
 

88

కూర మెత్తగా ఉడికితే చివరిలో గరం మసాలా (Garam masala), కొత్తిమీర (Coriander) తరుగు వేసి బాగా కలుపుకొని కూరలో నీరు పూర్తిగా ఇమిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే స్పైసి నాటుకోడి కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి.

click me!

Recommended Stories