
నానబెట్టిన బెండకాయ నీటిని (Okra water) తీసుకుంటే మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు (Health benefits) అనేకం అని వైద్యులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మలబద్దకం సమస్యలు తగ్గుతాయి: బెండకాయ నీటిలో ఉండే ఫైబర్ పేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరిచి మలవిసర్జన (Defecation) సాఫీగా జరిగేలా చేస్తుంది. కనుక మలబద్దకం (Constipation) సమస్యలతో బాధపడే వారు నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలను పొందగలరు.
రక్తహీనత సమస్యలు తగ్గుతాయి: చాలా మంది రక్తహీనత (Anemia) సమస్యల కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటివారు నానబెట్టిన బెండకాయ నీటిని ప్రతి రోజూ తీసుకుంటే ఎర్రరక్తకణాల సంఖ్య అభివృద్ధి చెందుతుంది. దీంతో శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ శాతం (Percentage of hemoglobin) ఉత్పత్తి అవుతుంది.
గొంతు సంబంధిత సమస్యలు తగ్గుతాయి: నానబెట్టిన బెండకాయ నీటిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు (Antiseptic properties) పుష్కలంగా ఉంటాయి. ఇవి వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే గొంతునొప్పి, గొంతు వాపు, దగ్గు, గొంతులో దురద, వంటి గొంతు సంబంధిత సమస్యలను (Throat related problems) తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: బెండకాయ నీటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను (Cholesterol levels) తగ్గించడానికి చక్కగా సహాయపడుతుంది. దీంతో గుండెపోటు వంటి సమస్యలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతుంది: నానబెట్టిన బెండకాయ నీటిలో ఇన్సులిన్ ప్రాపర్టీలు (Insulin properties) ఉంటాయి. ఇవి డయాబెటిస్ (Diabetes) వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. కనుక నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
అతిసారాన్ని నియంత్రిస్తుంది: అతిసారంతో (Diarrhea) శరీరంలో నుంచి నీరు అధికంగా బయటకు పోతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్ (Dehydration) బారినపడుతుంది. కనుక ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: బెండకాయలలో వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచే అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి (Vitamin C) శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది.
ఎముకలు దృఢంగా మారుతాయి: బెండకాయ నీటిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు (Medicinal properties) ఎముకలను దృడంగా మారుస్తాయి. కనుక గర్భిణీ మహిళలు బెండకాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే పుట్టబోయే బిడ్డ ఎముకలు ఆరోగ్యంగా (Bone health), దృడంగాఆరోగ్యంగా ఉంటాయి.
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది: నానబెట్టిన బెండకాయ నీటిలో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా (Skin health) ఉంచడానికి సహాయపడతాయి.