వంకాయల్ని తింటున్నారా అయితే అవి ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 12, 2021, 01:18 PM IST

వంకాయలను (Brinjals) చాలామంది తినడానికి ఇష్టపడతారు. వంకాయలతో అనేక రకాల వంటలు తయారు చేసుకుంటారు. ఇది ఏడాది పొడవునా దొరికే కూరగాయ. కూరగాయల రాజా ఎవరంటే వంకాయ అని అంటారు. అయితే వంకాయలను ఎక్కువగా తీసుకుంటే శరీరారోగ్యానికి ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వంకాయలు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం..  

PREV
17
వంకాయల్ని తింటున్నారా అయితే అవి ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

వంకాయలలో అనేక రకాలు (Types) ఉంటాయి. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, పొడవు వంకాయలు ఇలా అనేక రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకము వంకాయ ఒక్కొక్క రకం రుచిని (Taste) కలిగి ఉంటాయి. వంకాయలతో మనం నిత్యం గుత్తి వంకాయ, తాలింపులు, మసాలా కూరలు ఇలా ఎన్నో రకాలు చేసుకుంటుంటాం. వంకాయలతో చేసుకునే ప్రతి కూర చాలా రుచిగా ఉంటుంది. అయితే వంకాయలలో అనేక పోషక విలువలు (Nutritional values) ఉంటాయి. వంకాయ ఆరోగ్యానికి మంచిదే.

27

అయితే వీటిని అధిక మొత్తంలో కాకుండా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వంకాయలను తినకపోవడమే మంచిదని తింటే వారి అనారోగ్య సమస్యలు (Illness issues) మరింత ఇబ్బందిని (Embarrassment) కలిగిస్తాయి అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏలాంటి సమస్యలు ఉన్నవారు ఈ వంకాయలను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

37
brinjal

మధుమేహం ఉంటే: మధుమేహం (Diabetes) ఉన్నవారు వంకాయలకు దూరంగా ఉండడమే మంచిది. ఎక్కువగా వంకాయలను తినడంతో రక్తంలోని చక్కెర శాతం (Blood sugar percentage) పెరుగుతుంది. కనుక మధుమేహం ఉన్నవారు వంకాయను తినకపోవడమే మంచిది.

 

47

బ్లడ్ ప్రెషర్: రక్తపోటు సమస్యలు (Blood pressure problems) ఉన్నవాళ్లు వంకాయలకు దూరంగా ఉండాలి. వంకాయలను అధికంగా తింటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు (Health problems) ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

 

57

కడుపులో మంట: వంకాయలను తినడం వల్ల జీర్ణక్రియ (Digestion) మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా తీసుకోవడంతో కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదర సమస్యలు (Abdominal problems) ఉన్నప్పుడు వంకాయలను తినకండి. ఇది ఉదర భాగానికి మంచిది కాదు.

67

brinjal and toఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది: చాలామందికి వంకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటుంటారు. అయితే వంకాయలను తీసుకోవడంతో ఎలర్జీ (Allergy) వచ్చే అవకాశాలు ఉన్నాయి. దురద, మంట వంటి చర్మ సమస్యలు (Skin problems) ఉన్నవారు వంకాయలను తినకపోవడమే మంచిది.
mato in a plant

77

జ్వరం వచ్చినప్పుడు: శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు జ్వరం (Fever) వచ్చినప్పుడు వంకాయలు అస్సలు తీసుకోరాదు. వంకాయలను తినడంతో శరీరంలో ఉష్ణోగ్రత (Body temperature) పెరుగుతుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు తీసుకునే ఆహార పదార్థాలలో వంకాయను చేర్చకండి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.

click me!

Recommended Stories