నిల్వ ఉంచిన ఊరగాయలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 12, 2021, 11:54 AM IST

భారతీయులకు ఊరగాయ (Pickle) లేనిదే భోజనం సంపూర్ణం కాదు. ఊరగాయలు చూడడానికి ఎర్రగా నోరూరిస్తూంటాయి. అయితే కొంతమందికి పచ్చలు లేనిదే ముద్ద దిగదు. రోజు భోజనంలో ఊరగాయ ఉండవలసిందే. అయితే అధిక మొత్తంలో ఊరగాయలు తీసుకుంటే శరీరానికి మంచిది కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. మితంగా తింటే పర్వాలేదు కానీ అమితంగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు (Health Problems) ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్  ద్వారా ఊరగాయలు ఎక్కువగా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..  

PREV
17
నిల్వ ఉంచిన ఊరగాయలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

ఊరగాయలు కారంగా, ఉప్పుగా, రుచిగా (Delicious) తింటుంటే తినాలనిపిస్తుంది. అయితే ఊరగాయలను ఎక్కువగా తింటే మన శరీరం అనేక ఆరోగ్య సమస్యలకు (Health problems) గురవుతుంది. శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఊరగాయలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఊరగాయలకు దూరంగా ఉండాలంటే కాస్త కష్టమే కానీ కొన్ని నియమాలను పాటిస్తే ఏలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది.
 

27

నూనె: ఊరగాయ అంటేనే నిల్వ పదార్థాలు. ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు అధిక మొత్తంలో నూనెను (Oil) ఉపయోగిస్తారు. అలాగే ప్యాక్ చేసినా ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉండటానికి నూనెతో పాటు ఉప్పు, వెనిగర్ (Vinegar) ఎక్కువగా కలుపుతారు. ఈ పదార్థాలు శరీర ఆరోగ్యంపై ప్రభావితం చూపుతాయి. దాంతో మన శరీరం అనారోగ్యం పాలవుతుంది.
 

37

ఉదర సమస్యలు: ఎక్కువగా ఊరగాయలు తినే వారిలో ఉదరంలో నొప్పి, పిత్తాశయ సమస్యలు (Gallbladder problems) ఏర్పడతాయి. కడుపుబ్బరం, కడుపు నొప్పి సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. కనుక నిత్యం కూరగాయలు తీసుకునే వాళ్లు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. లేకపోతే ఉదర సమస్యలు (Abdominal problems) ఏర్పడతాయి.
 

47

జీర్ణాశయ సమస్యలు: ఊరగాయలలో అధిక మొత్తంలో ఉండే ఉప్పు, కారం, నూనె కారణంగా జీర్ణాశయ సమస్యలు (Gastrointestinal problems) తీవ్రమవుతాయి. ఊరగాయలలో అధిక మొత్తంలో సోడియం (Sodium) ఉంటుంది. దీని కారణంగా శరీరానికి కావలసిన దానికన్నా ఎక్కువ నీటిశాతం అందించాల్సి వస్తుంది.
 

57

అల్సర్: ఊరగాయలను ఎక్కువ మొత్తంలో నిత్యం తీసుకుంటే పొట్టలో, పేగులలో (Intestines) అల్సర్  సమస్యలు (Ulcer problems) ఏర్పడతాయి. ఉరగాయలలో ఉండే అధిక కారం అల్సర్ సమస్యలకు కారణం అవుతుంది.
 

 

67

ఫైల్స్: నిత్యం ఊరగాయలను ఆహారంలో తీసుకుంటే మొలల సమస్య ఉన్నవారికి సమస్య మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక మొలల సమస్య ఉన్న వాళ్లు పచ్చళ్ళకు దూరంగా ఉండడమే మంచిది. ఊరగాయలలో అధిక మొత్తంలో ఉండే కారం (Chili), ఘాటు పదార్థాలు ఫైల్స్ సమస్యను (Files issue) మరింత తీవ్రపరుస్తాయి.
 

77

రక్తపోటు: పచ్చళ్ళలో అధిక మొత్తంలో ఉండే కారం, ఉప్పు, నూనెలు బీపీని పెంచుతాయి.  బ్లడ్ ప్రెషర్ (Blood pressure) పెరగడంతో అనేక ఆరోగ్య సమస్యలు (Health problems) ఎదురవుతాయి. రోజు తినాలనిపిస్తే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు.

click me!

Recommended Stories