ఎడమవైపు తిరిగి నిద్రపోతేనే మంచిదట.. ఎందుకో తెలుసా?

First Published | Sep 21, 2024, 10:36 PM IST

బాగా అలసిపోతే మనకి మత్తుగా నిద్ర వచ్చేస్తుంది కదా.. అప్పుడు మనం ఎలా పడుకుంటామో మనకే తెలియదు. కాని మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర ఎంత ముఖ్యమో ఎటువైపు తిరిగి పడుకుంటున్నామో కూడా చాలా ఇంపార్టెంట్.  డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మాత్రమే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆకలికి రుచి తెలియదు. నిద్రకు చోటు తెలియదు అని సామెత ఉంది. దాని ప్రకారం మన శరీరం అలసిపోతే రోడ్డు పక్కన కూడా హాయిగా నిద్రపోవచ్చు. పరుపు, దిండు, దుప్పటి ఇలాంటివి ఏం లేకపోయినా మనం హాయిగా నిద్రపోతాం. నిద్ర మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే చాలా ఇంపార్టెంట్ విషయం. ఏ వయసు వారైనా 7 గంటల నుండి 9 గంటల వరకు కచ్చితంగా నిద్రపోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలమట. మంచి నిద్ర శరీరానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం.

కానీ ఎలా నిద్రపోవాలి అనే దాని గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఎందుకంటే చాలామంది స్ట్రైట్ గా నిద్రపోవడమే మంచిదని అనుకుంటారు. కానీ నిద్రపోయేటప్పుడు ఎడమ వైపుకు పడుకుంటేనే అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

జీర్ణవ్యవస్థకు మేలు..

గాఢనిద్రలో ఉంటే ఏ వైపు చేయి వెళుతుంది. కాలు ఎక్కడ పెడతాం. ఇలాంటివేవీ మనకు తెలియదు. కానీ నిద్రించే విధానం శారీరక ఆరోగ్యానికి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం నిద్రపోయినా, మన అంతర్గత అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి అంతర్గత అవయవాలు పనిచేయడానికి అనుకూలమైన ఎడమ వైపు పడుకోవడమే మంచిది. ఎడమ వైపుకు పడుకుంటే అనేక వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.  ఎందుకంటే ఎడమ వైపు నిద్రపోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. మనం తినే ఆహారాన్ని గ్రహించే ప్రేగుల కదలిక కూడా మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడితే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు సరిగ్గా బయటకు పోతాయి.   

Latest Videos


టాక్సిన్స్ బయటకు పోతాయి 

ఎడమ వైపుకు నిద్రించడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా ఆపుతుంది. తద్వారా తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  తిన్న ఆహారంలోని వ్యర్థాలన్నీ పేగుల సిస్టమ్  ద్వారా బయటకు పంపడానికి వీలవుతుంది. 

కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది 

శరీరంలో కాలేయం, మూత్రపిండాలలోనే వ్యర్థాలు, టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతాయి. కానీ ఎడమ వైపుకు నిద్రిస్తే ఈ అవయవాలలో పేరుకుపోయిన వ్యర్థాలు, టాక్సిన్స్ ఈజీగా ఉదయన్నే బయటకు వచ్చేస్తాయి. .

జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది 

ఎడమ వైపుకు నిద్రపోవడం వల్ల కడుపు, క్లోమం సహజంగా కలుస్తాయి. ఇది ఆహారం సజావుగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఆహారాలు కూడా కడుపు ద్వారా అధిక గురుత్వాకర్షణ శక్తి కారణంగా సులభంగా జీర్ణమై బయటకు పోతాయి.

సున్నితమైన ప్రేగు కదలిక 

ఎడమ వైపుకు నిద్రిస్తున్నప్పుడు తిన్న ఆహారం చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగుకు గురుత్వాకర్షణ శక్తి కారణంగా సులభంగా వెళుతుంది. దీనివల్ల ఉదయం ఎలాంటి ఆటంకాలు లేకుండా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి.

యాసిడిటీ, గుండెల్లో మంట 

ఎడమ వైపు నిద్రపోవడం వల్ల, యాసిడిటీని కలిగించే కడుపులోని ఆమ్లం ఆహార గొట్టం ద్వారా పైకి రాకుండా ఉంటుంది. తద్వారా గుండెల్లో మంట తగ్గుతుంది.

అసౌకర్యం తగ్గుతుంది
ఎడమ వైపుకు నిద్రపోవడం వల్ల కాలేయం, పిత్తాశయం సహజంగా కలుస్తాయి. జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది తిన్న ఆహారాలు సులభంగా జీర్ణం కావడానికి, అసౌకర్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

కొవ్వు కూడా కరుగుతుంది 

కడుపులో రిలీజ్ అయిన కొన్ని యాసిడ్స్ ఎడమ వైపుకు నిద్ర పోవడం వల్ల  కొవ్వును సులభంగా కరిగిస్తాయి.  దీనివల్ల శరీరంలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. 

గురక తగ్గుతుంది 

మీరు నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారా? మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల మీ శ్వాస మార్గాలను తెరిచి ఉంటాయి. అందువల్ల రాత్రిపూట గురక రాకుండా ఉంటుంది. మీ పక్కన నిద్రపోయేవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది

ఎడమ వైపు నిద్రిస్తే  రక్తపోటు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్త ప్రసరణ కూడా బాగుంటుంది. అధ్యయనాల ప్రకారం ఎడమ వైపు నిద్రపోవడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 

వెన్ను నొప్పి నుండి ఉపశమనం

ఎడమవైపు నిద్రపోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెద్దగా ఉండదు. దీనివల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. 

ఎవరు ఎడమవైపు నిద్రపోకూడదు? 

గర్భిణులు (20 వారాల తర్వాత)

ఆస్తమా, శ్వాస ఇబ్బందులు ఉన్నవారు.  

తీవ్రమైన వెన్నెముక సమస్య ఉన్నవారు. 

వీరు తలగడపై కాళ్లను ఆసరాగా ఉంచి కుడి వైపుకు నిద్రపోవచ్చు.  

కుడి వైపుకు నిద్రిస్తే మంచిదా?

కుడి వైపుకు నిద్రపోవడం వల్ల టాక్సిన్స్ మన శరీరం నుండి బయటకు పోవు. దీనివల్ల జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణక్రియలో తీవ్రమైన ప్రభావం చూపుతుంది.  

స్టైట్ గా పడుకుంటే మంచిదా? 

సూటిగా నిద్రిస్తే రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.  కొంతమందికి శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ రుగ్మతలు వస్తాయి. ఇప్పటికే ఆస్తమా ఉన్నవారు ఇలా నిద్రపోవడం వల్ల హాని కలుగవచ్చు.

click me!