అల్లం టీ ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా? దీనివల్ల ఏయే సమస్యలు వస్తాయో తెలుసా?

First Published | Sep 21, 2024, 5:06 PM IST

మనలో చాలా మంది రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగుతుంటారు. ఇతర టీ ల కంటే అల్లం టీనే ఆరోగ్యానికి ఎక్కువ మంచిదని అనుకుంటుంటారు. కానీ అల్లం టీ కూడా మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

ginger tea

మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది ఆరోగ్యానికి మంచిదని అల్లం టీనే రోజూ తాగుతుంటారు.నిజానికి అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అల్లం టీ మనం అనుకున్నంత మంచిది అయితే కాదు. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అల్లంతో చేసిన టీ ఆరోగ్యానికి మేలు కంటే ఎక్కువ హాని చేస్తుంది. అవును వేసవిలో అల్లం టీ తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా స్తాయి. అంతేకాదు బీపీ కూడా బాగా తగ్గుతుంది. అందుకే రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ టీ తాగకూడదని డాక్టర్లు చెప్తారు. అసలు అల్లం టీ అతిగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


అల్లం టీ తాగడం వల్ల వచ్చే సమస్యలు 

ఎసిడిటీ 

మనలో చాలా మంది రోజుకు మూడునాలుగు సార్లైనా టీ తాగుతుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు అల్లం టీని రోజుకు 1 నుంచి 2 కప్పులు మాత్రమే తాగాలి. ఇంతకంటే ఎక్కువ తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుకుంటాయి. టీలో అల్లం ఎక్కువగా వేయడం వల్ల మీకు గ్యాస్, ఎసిడిటీ, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి.అంతేకాదు కడుపునకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అల్లం టీని అస్సలు తాగకూడదు. 
 

రక్తాన్ని పలుచగా చేస్తుంది

సహజంగా అల్లంలో రక్తాన్ని పలుచగా చేసే గుణాలుంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఇప్పటికే సన్నని రక్తాన్ని కలిగి ఉంటే అల్లం టీని తాగకండి. ఒకవేళ తాగితే మీ రక్తం మరింత పల్చగా మారుతుంది. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 
 


రక్తపోటును తగ్గిస్తుంది

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి అల్లం టీ ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఇది బీపీని తగ్గించడానికి కూడా సహాయపడుతుందన్న మాట. ఇలాంటి పరిస్థితిలో మీకు ముందే బీపీ తక్కువగా ఉంటే.. మీరు అల్లం టీ తాగితే మీ బీపీ మరింత తగ్గుతుంది. అల్లంలో బీపీని తగ్గించే కొన్ని భాగా ుంటాయి. దీనివల్ల తక్కువ బీపీ ఉన్నవారు మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రెగ్నెన్సీ టైంలో వద్దు

ప్రెగ్నెన్సీ టైంలో అల్లాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే అల్లం  వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కడుపులో వేడిని కలిగిస్తుంది. అలాగే అల్లం టీని తాగితే గ్యాస్, ఎసిడిటీ మొదలైన సమస్యలు ఎక్కువ అవుతాయి. అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలుగుతుంది.
 

అలెర్జీలు 

కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలకు అలెర్జీ ఉంటుంది. మీకు అల్లానికి అలెర్జీ ఉన్నట్టైతే అల్లం టీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది చర్మంపై దురద, దద్దుర్లు, వాపు వంటి సమస్యలను కలిగిస్తుంది.

click me!