ఈ విషయాలు తెలిస్తే పెరుగును తినకుండా అస్సలు ఉండరు..

Published : Aug 11, 2023, 04:33 PM IST

పెరుగు మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే  పోషకాలను కలిగి ఉంది.  పెరుగులో విటమిన్లతో పాటుగా క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి.   

PREV
110
ఈ విషయాలు తెలిస్తే పెరుగును తినకుండా అస్సలు ఉండరు..

పెరుగులో మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు పులియబెట్టిన పాల నుంచి తయారవుతుంది. ఈ పెరుగు మన మొత్తం ఆరోగ్యాన్ని పెంచే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగు పోషకాలకు మంచి వనరు. దీనిని కాలాలతో సంబంధం లేకుండా తినాలి. పెరుగును చలికాలంలో, వానలు పడుతున్నప్పుడు మధ్యాహ్నం పూట తినాలి. దీంతో జలుబు చేసే అవకాశం తగ్గుతుంది. పెరుగును రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

210

జీర్ణం

పెరుగు ఒక గొప్ప ప్రోబయోటిక్. ప్రోబయోటిక్ కావడంతో పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోజూ పెరుగును తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. కడుపు అసౌకర్యాన్ని తగ్గించడానికి, కడుపు,  పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా పెరుగు సహాయపడుతుంది. పెరుగును తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. 
 

310
Image: Getty Images

రోగనిరోధక శక్తి 

పెరుగు ప్రోబయోటిక్ కాబట్టి.. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర రోగాల ప్రమాదం తగ్గుతుంది. 
 

410

ఎముకల ఆరోగ్యం

కాల్షియం ఎక్కువగా ఉండే పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పెరుగు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పెరుగులో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది.పెరుగులో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలు, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

510

గుండె ఆరోగ్యం

పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి,  గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. పెరుగు గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 

610
yogurt

డయాబెటిస్ మెల్లిటస్

పెరుగును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
 

710

బరువు తగ్గాలంటే

కేలరీలు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం ఆకలిని  బాగా తగ్గుతుంది. ఇది మీరు  ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరుగు కూడా మీ కడుపును తొందరగా నింపుతుంది. 
 

810
Image: Getty Images

మానసిక ఆరోగ్యం

పెరుగు ప్రోబయోటిక్ కాబట్టి.. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నిరాశ, యాంగ్జైటీ, ఒత్తిడి మొదలైన మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ పెరుగు మానసిక ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

910

ఎనర్జీ

పెరుగు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం. కాబట్టి దీన్నిన క్రమం తప్పకుండా ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. 
 

1010

చర్మ ఆరోగ్యం

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగు తినడానికి మాత్రమే కాదు.. ముఖానికి అప్లై చేయడానికి కూడా మంచిది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ ను పోగొడుతుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories